వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందుకోసం బుధవారం ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6:30 గంటలకు సేనాపతి ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రేపు అప్పలాయగుంటలో పుష్పయాగం
తిరుపతి అర్బన్: వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందుకోసం బుధవారం ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6:30 గంటలకు సేనాపతి ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అనంతరం 11:30 గంటల వరకు శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పలురకాల పుష్పాలతో అలంకరించనున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పూజలు, కైంకర్యాలు, గత నెలలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.