వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ | starts on pavitrotshavas in appalayagunta | Sakshi
Sakshi News home page

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Published Tue, Sep 27 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

స్వామివారికి అంకురార్పణ చేస్తున్న అర్చకులు

స్వామివారికి అంకురార్పణ చేస్తున్న అర్చకులు

అప్పలాయగుంట(వడమాలపేట): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొపిన అర్చకులు  శుద్ధి, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన, బలిహరణ శాస్త్రోత్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించగా భక్తులు స్వామివారి సర్వదర్శం చేసుకున్నారు. పండితులు హోమం నిర్వహించారు. సాయంత్రం మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం చేశారు. విశ్వసేనుని పల్లకిలో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ పుట్టమట్టిని తీసుకుని సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆ మట్టిని ఆలయానికి తీసుకువచ్చి నవధాన్యాలను మొలకవేసి వైభవంగా అంకురార్పణం జరిపించారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ జరిగింది. కార్యక్రమంలో ఏఈవో రాధాకష్ణ, సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, షరాబ్‌ హర్షవర్ధన్, ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement