తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము 3 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు 44,917 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వ దర్శనం కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయి క్యూ వెలుపలకు వచ్చింది. వీరికి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో సాయంత్రం 5 గంటలకు రూ.300 టికెట్ల ప్రత్యేక దర్శనాన్ని నిలిపివేశారు. అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి ఉన్న కాలిబాట భక్తులకు దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు లభించింది.