మంచు లక్ష్మీ ప్రసన్న నటిగానే కాదు.. యాంకర్, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూతురు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె గారాల పట్టి విద్యా నిర్వాణ తల్లితో కలిసి ఈ మధ్యే యూట్యూబ్‌లో అడుగు పెట్టింది. ‘చిట్టి చిలకమ్మ’ అంటూ ప్రేక్షకులను పలకరించింది. ఇక తాజాగా ఈ చిన్నారి మహాశివరాత్రిని పురస్కరించుకుని తొలిసారిగా పాట పాడింది. అయితే వినేవాళ్లకు మాత్రం ఆమె మొదటిసారి పాడుతుందన్న భావన కలగకపోవడం విశేషం.(ఈ సిరీస్‌కు అందరూ కనెక్ట్ అవుతారు: మంచు లక్ష్మీ)
అనుభవజ్ఞురాలిగా, ఎంతో నిబద్ధతగా, అంకితభావంతో ముద్దుముద్దు మాటలతో ఆమె పాడటం అందరినీ ఆకర్షిస్తోంది. ‘అయిగిరి నందిని..’ అంటూ ఉగ్రంగా పాడుతూనే అంతలోనే శాంతంగా మారుతూ ఎన్నో వేరియేషన్స్ చూపించింది. ఇలా పాటకు తగ్గట్టుగా హావభావాలు ఒలికించిన తీరు చూస్తుంటే నిర్వాణ తప్పకుండా గొప్ప సింగర్‌గా రాణిస్తుందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, కొన్నిచోట్ల మాత్రం పదాలు పలకడానికి కాస్త కష్టపడిందనే చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో మంచు లక్ష్మితో పాటు, మనోజ్ కూడా చిన్నారితో ఆడిపాడుతూ కనిపించారు. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన మంచు లక్ష్మీ ‘ఇది తనకు గుర్తుండిపోయే శివరాత్రి’ అని సంతోషం వ్యక్తం చేశారు. (మూడేళ్ల తర్వాత వస్తున్న మంచు మనోజ్)
Comments
Please login to add a commentAdd a comment