Manchu Laxmi prasanna
-
మనోజ్‌కు రాఖీ కట్టిన మంచు లక్ష్మి.. మరి విష్ణు ఎక్కడ?
మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని వాళ్లు చెప్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో వారి మధ్య ఉన్న గొడవలు, డిస్టబెన్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మనోజ్ అనుచరుడిపై విష్ణు గొడవకు దిగిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మనోజ్ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడే కనిపించలేదు. విష్ణు ఫ్యామిలీ సమయానికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి అతిథిలా వచ్చి వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. అటు మంచు లక్ష్మి మాత్రం తమ్ముడి పెళ్లిని భుజాన వేసుకుని స్వయంగా తన ఇంట్లోనే జరిపించింది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసి మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో మరోసారి ఈ ఊహాగానాలకు తెర లేపింది. మంచు మనోజ్‌కు రాఖీ కట్టిన లక్ష్మి వారితో కలిసి ఓ రెస్టారెంట్లో లంచ్ చేసింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రేమ, సరదా, రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్ జరిగింది' అని రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోల్లో మంచు విష్ణు లేడు. ఇది చూసిన జనాలు అంతా బానే ఉంది.. కానీ, మంచు విష్ణు ఎక్కడ? అని కామెంట్లు చేస్తున్నారు. విష్ణుకు రాఖీ కట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాఖీ లంచ్ అంటూ మనోజ్‌తో మాత్రమే దిగిన ఫోటోనే షేర్ చేసిందంటే విష్ణుకు రాఖీ కట్టనట్లుంది అని అభిప్రాయపడుతున్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతోందని అనుమానిస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సి ఉండగా నటి ఇంట విషాదం -
ఆకట్టుకుంటున్న ‘పాప చలో హైదరాబాద్’ సాంగ్
ఇండియా అబ్బాయి తను ప్రేమించిన అమెరికన్ అమ్మాయిని తన మాతృదేశానికి తీసుకు రావాలనే కొరికతో దేశం మారిపోతే లైఫ్ సరదాగా ఉంటుందని నచ్చజెపుతూ ఆ అమ్మాయికి ఇక్కడ ఉంటే బాగుంటుందని కన్విన్స్ చేసి తన మాతృదేశానికి తీసుకురావడానికి చేసిన చిన్న ప్రయత్నమే "పాప చలో హైదరాబాద్"..జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ పతాకంపై సింగర్ శ్రీకాంత్ సందుగు పాడిన "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను ఆనంద్ భట్ దర్శకత్వం వహించగా శ్రీని రజినీకాంత్ గంగవరవు నిర్మించారు .ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్, లక్ష్మీ దేవినేని , జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి ,సింగర్ శ్రీకాంత్ సందుగు తల్లిదండ్రులు రంగాచారి, ఆండాళ్, కుటుంబ సభ్యులు శేషాచారి, శ్రీలత, కృష్ణ కళ, వేణు మాధవ్, శ్రీ వేద్, సింగర్ శ్రీకాంత్ సందుగు ఫ్రెండ్ ప్రవీణ్,అశ్విని, తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నటి మంచు లక్ష్మి , సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేశారు. అలాగే ఆర్.పి పట్నాయక్ రాసిన "అమ్మ పాట" ప్రోమోను విడుదల చేశారు. ఈ పూర్తి పాటను అమ్మలకు డెడికెట్ చేస్తూ మదర్స్ డే సందర్భంగా మే 9న విడుదల చేస్తారు.అనంతరం ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ... నా కెరియర్ కూడా యూఎస్ఏ నుంచే స్టార్ట్ అయింది. అయితే మనం యు.యస్ లో ఉండి ఎంత పేరు సంపాదించుకున్నా.. మన మాతృదేశంలో మన పాటను, మన ఫోటోను బిగ్ స్క్రీన్ పై చూసుకొంటే ఆ కిక్కే వేరు. తను నటిస్తూ పాడిన ఈ ఆల్బమ్ శ్రీకాంత్ కు ఏంతో మంచి పేరు తెచ్చిపెట్టాలి. తను ఇంకా ఎన్నో పాటలను ఇక్కడ ఆడియన్స్ కు పరిచయం చేయాలని అశిస్తున్నాను. అమెరికాలో వుండే ఎంతో మంది శ్రీకాంత్ లా ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో తమ ప్రతిభ ను నిరూపించుకోవాలని అన్నారు. సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ఆమెరికాలో జరిగే నా షో లలో శ్రీకాంత్ టీం తప్పక ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వీరు చేసే ప్రతిదీ కొత్తగా ఉండాలని కొరుకుంటుంటారు. శ్రీకాంత్ అమెరికాలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఈ రోజు వారు నటిస్తూ పాడిన ఆల్బమ్ ఇండియాలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికా వారు పాడిన ఆల్బమ్స్ ఎంతటి విజయం సాదించాయో ఈ రోజు ఇండియాలో విడుదల చేస్తున్న ఈ ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ ఎప్పుడు అమ్మతో మొదలవుతుంది. అలాగే నా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా "అమ్మ పాట" తో మొదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నేను కమిట్ అయిన సినిమా విషయాలు త్వరలో తెలియ జేస్తాను అని అన్నారు. సింగర్ శ్రీకాంత్ సందుగు మాట్లాడుతూ... చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం.మా కాలేజ్ లో జరిగే ప్రతి ఈవెంట్ లో పాటలు పాడే వాణ్ణి. కానీ నాకు అప్పుడు ఇది ప్రొఫెషన్ గా తీసుకోవాలని ఆరోజు అనుకోలేదు. తరువాత 2004 లో చుదువు రిత్యా అమెరికా వెళ్లడం జరిగింది. అమెరికాలో జరిగిన "పాడుతా తీయగా" మొదటి ఎపిసోడ్ లో సింగర్ గా పాడాను. ఆ పాటకు నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. సంగీత విద్వాంసుడు బాలు గారు కూడా నన్ను అప్రిసియేట్ చేయడం జీవితంలో మరచిపోలేను. అలా వారు ప్రశంశించి చెప్పిన మాటలకు మోటివేట్ అయ్యాను. అప్పటినుండి నేను సింగర్ కావాలనే ప్యాసినెట్ తో వర్క్ చేశాను. యు.యస్ లో ఇప్పటి వరకు 450 ప్రోగ్రామ్స్ చేశాను. అక్కడ వుండే ప్రతి అసోసియేషన్ కు,ఆర్గనైజేషన్ కు పాడడం జరిగింది.మ్యూజిక్ అంటే నాకు ఏంతో ఇష్టం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా చూసుకునేవాన్ని..ఇకనుండి నేను సింగర్ గా పాడిన పాటలు పాట రూపకంగా కాక విజువల్ గా కూడా నేను ప్రేక్షకులకు కనపడాలని కోరికతో ఆర్టిస్ట్ గా చేసి ప్రపంచంలో వుండే తెలుగు వారందరికీ దగ్గరవ్వాలనే కోరికతో.. అమెరికాలోని చికాగో లో హైదరాబాద్ సిటీ గురించి పాడిన "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను నేను పుట్టి పెరిగిన, హైదరాబాద్ లో విడుదల చేస్తే బాగుంటుందని ప్రముఖ నటి మంచు లక్ష్మి, , సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ లను కలవడం జరిగింది.కోవిడ్ టైంలో కూడా వారు నన్ను, నా పాటను బ్లెస్స్ చేయడానికి వచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో వుంటూ యాంకరింగ్ ను ప్రొఫెషన్ గా తీసుకొని అమెరికాలో ఎన్నో పెద్ద, పెద్ద కన్వెన్షన్, అసోసియేషన్స్ లకు హోస్టింగ్ చేసిన ప్యాసినెట్ యాంకర్ సాహిత్య ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు ప్రొడక్షన్ ఇంచార్జ్ గా ఉంటూ.. ఈ ఆల్బమ్ బాగా రావాలని తను ఏంతో డెడికెట్ గా వర్క్ చేయడమే కాక ఈ ఈవెంట్ కు తనే ఆర్గనైజ్ చేసి మా ఈవెంట్ సక్సెస్స్ చేసింది. ఆర్.పి పట్నాయక్ రాసిన అమ్మ పాటలో సాహిత్య లీడ్ రోల్ లో నటించింది. ఈ పాటతో తనకు మంచి పేరుతో పాటు,మంచి నటిగా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.అలాగే నా ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు సమక్షంలో ఈ ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇది మా ఫస్ట్ ప్రాజెక్టు ఇలాంటి మంచి పాటతో మేము మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సాంగ్ మంచి విజయం సాధించాలి త్వరలో బాలకృష్ణ గారి ఆశీస్సు లతో జెమిని ఎంటర్ టైన్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం అని అన్నారు. మాధవ పెద్ది సురేష్ మాట్లాడుతూ... అమెరికాలో వీరు నాకు ఒక ఈవెంట్ చెసినప్పుడు వీరికి మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నాను. అనుకున్నట్లే వారు అమెరికాలో ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేసి అక్కడ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు ఇండియాలో కూడా తన పాటల ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ కు నన్ను ఇన్వైట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.తనకు ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలి అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ శ్రీకాంత్ సందుగు కుటుంబ సభ్యులు, మరియు ఫ్రెండ్స్ అందరూ ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని కోరుకొంటున్నామని అన్నారు. -
మంచు లక్ష్మి @100 కి.మీ రైడ్
-
నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్
♦ ధైర్యంగా ఉంటే అద్భుతమైన శక్తులు వస్తాయని అంటున్నారు మంచు లక్ష్మీ. వీకెండ్ మూడ్ అంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ♦ వీకెండ్ మూడ్ అంటూ నవ్వుతూ కళ్ల జోడు పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ♦ నీతో ఉంటే జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందంటూ హబ్బీకి బర్త్‌డే విషెష్ చెప్పింది మాధురీదీక్షిత్. ♦ వీకెండ్‌ని ఎంజాయ్ చేయండంటూ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేం సావిత్రి ♦ నవ్వుతూ ఉండండి.. సంతోషంగా ఉండంటూ పప్పీ హ్యాపీ మూడ్ పిక్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గాయని మధుప్రియ ♦ లైగర్ ముంబైలో ల్యాండ్ అయిందంటూ విజయ్‌దేవరకొండ ఫోటోలను చార్మి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ♦ అల్లు శిరీష్ జిమ్ చేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ♦ View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) I'm back... To discipline, clean diet and strength training. pic.twitter.com/9FS6sSZnHU — Allu Sirish (@AlluSirish) February 13, 2021 View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
టీజర్: నలుగురు హీరోయిన్ల ‘పిట్ట కథలు’
హిందీలో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ సోరీస్’ వెబ్ సిరీస్ తెలుగులో ‘పిట్ట కథలు’పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మొత్తం నాలుగు కథలుగా ఉన్న ఈ సీరిస్‌ని నలుగు దర్శకులు తెలుగులో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్(పెళ్లి చూపులు ఫేమ్), నందిని రెడ్డి(‘ఓ బేబీ’ఫేమ్), నాగ్ అశ్విన్ (‘మహానటి’ఫేమ్), సంకల్ప్ రెడ్డి(‘ఘాజీ’ఫేమ్)లు తెరకెక్కించిన ఈ పిట్టకథలు సిరీస్ టీజర్ బుధవారం విడుదలైంది. మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్, జగపతిబాబు, సత్యదేవ్, మేఘన, సంజిత్ హెగ్డే నటించిన ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సిరీస్ కథాంశమే బోల్డ్ కాబట్టి, టీజర్ లో అది ఏ లెవెల్లో ఉంటుందో చూపించారు. నాలుగు విభిన్న కథలు కలిగిన మహిళలు వారి జీవితానికి చెందిన ప్రేమ, ఎమోషన్స్ వాటికి వారి నలుగురికి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటి అన్నదే ఈ సిరీస్ కథాంశం. ఆర్ఎస్వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘పిట్ట కథలు’ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ కానుంది. మరి హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి. -
నాన్న తన సొంత పేరుతో నటిస్తున్నారా: మంచు లక్ష్మీ
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా విలక్షణ గొంతుతో అభిమానులకు చేరువయ్యారు. ఇటీవలే తన కూతురుతో కలిసి యూట్యూబ్‌లో ‘చిట్టి చిలకమ్మ’ అనే ఛానల్ పెట్టిన లక్ష్మీ.. పిల్లల పెంపకంపై వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఆమె తన తండ్రి మోహన్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘భక్త వత్సలం నాయుడు’. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఈ విషయాన్ని ఓ నెటిజన్ శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు. నాన్న తన సొంత పేరుతో సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికీ తెలియదంటూ పేర్కొన్నారు. ‘ఓహ్ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించాడని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’ అంటూ ట్వీట్ చేశారు. Ohh I didn’t know he used his birth name. How cool AND just how handsome is appa in that uniform. @Suriya_offl my special mention with graphics better be there!🥳🥳🥳 @themohanbabu my daddy is the awesomest! https://t.co/BPOCo4QH30 — Lakshmi Manchu (@LakshmiManchu) February 28, 2020 -
పాటతో అదరగొట్టిన మంచు లక్ష్మీ కూతురు
-
మంచు లక్ష్మీ కుమార్తె ‘అయిగిరి నందిని’
మంచు లక్ష్మీ ప్రసన్న నటిగానే కాదు.. యాంకర్, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూతురు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె గారాల పట్టి విద్యా నిర్వాణ తల్లితో కలిసి ఈ మధ్యే యూట్యూబ్‌లో అడుగు పెట్టింది. ‘చిట్టి చిలకమ్మ’ అంటూ ప్రేక్షకులను పలకరించింది. ఇక తాజాగా ఈ చిన్నారి మహాశివరాత్రిని పురస్కరించుకుని తొలిసారిగా పాట పాడింది. అయితే వినేవాళ్లకు మాత్రం ఆమె మొదటిసారి పాడుతుందన్న భావన కలగకపోవడం విశేషం.(ఈ సిరీస్‌కు అందరూ కనెక్ట్ అవుతారు: మంచు లక్ష్మీ) అనుభవజ్ఞురాలిగా, ఎంతో నిబద్ధతగా, అంకితభావంతో ముద్దుముద్దు మాటలతో ఆమె పాడటం అందరినీ ఆకర్షిస్తోంది. ‘అయిగిరి నందిని..’ అంటూ ఉగ్రంగా పాడుతూనే అంతలోనే శాంతంగా మారుతూ ఎన్నో వేరియేషన్స్ చూపించింది. ఇలా పాటకు తగ్గట్టుగా హావభావాలు ఒలికించిన తీరు చూస్తుంటే నిర్వాణ తప్పకుండా గొప్ప సింగర్‌గా రాణిస్తుందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, కొన్నిచోట్ల మాత్రం పదాలు పలకడానికి కాస్త కష్టపడిందనే చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో మంచు లక్ష్మితో పాటు, మనోజ్ కూడా చిన్నారితో ఆడిపాడుతూ కనిపించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన మంచు లక్ష్మీ ‘ఇది తనకు గుర్తుండిపోయే శివరాత్రి’ అని సంతోషం వ్యక్తం చేశారు. (మూడేళ్ల తర్వాత వస్తున్న మంచు మనోజ్) -
నాకు తెలుసు నాని.. యూ విల్ కిల్ ఇట్
తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మంచి విజయాన్ని అందుకుంది. సీజన్-1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో బిగ్‌బాస్-2 మన ముందుకు రానుంది. కానీ, ప్రస్తుతం ఈ షో హోస్ట్ ఎన్టీఆర్ కాదు.. ఈ సారి నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండటంతో హోస్ట్‌గా నానిని సెలక్టు చేసి అఫీషియల్‌గా ప్రకటన కూడా చేశారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని.. ‘బిగ్‌బాస్-2’ హోస్ట్‌గాను కూడా అలరిస్తాడనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మంచు లక్ష్మీ తన ట్వీటర్ అకౌంట్లో స్పందించారు. అంతేకాక నానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ‘వాహ్.. చాలా మంచి ప్రకటన. నానిని హోస్ట్‌గా ప్రకటించడం సంతోషం. నాకు తెలుసు.. నాని నువ్వు సూపర్. యూ విల్ కిల్ ఇట్.. ఆల్ ది బెస్ట్. అని తన ట్వీటర్ అకౌంట్ పేర్కొన్నారు. మొదటి సీజన్ సెట్‌ను ముంబైలోని లోనావాలా దగ్గరాల్లో ఓ అడవిలో వేశారు. అయితే సీజన్ 2 సెట్ లోకల్లోనే ఉంటుంది. నగరం నడిబొడ్డున అన్నమాట. ఫస్ట్ సీజన్‌కి ముంబై వేదిక అయితే, సెకండ్ సీజన్ వేదిక హైదరాబాద్. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్ తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్ కళ్లు చెదిరేలా ఉంటుందని సమాచారం. -
డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు, విద్యావేత్త మోహన్ బాబు చెన్నైలోని ఏంజీఆర్ యూనివర్సిటీ నుంచి బుధవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మంచు లక్ష్మీ ట్విట్టర్లో తెలియజేశారు. ‘మేము ఈ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వం. చెన్నైలో నాన్న ఏంజీఆర్ యూనివర్సటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.’ అని తమ్ముడు మంచు మనోజ్‌తో దిగిన ఫొటోతో పాటు మోహన్ బాబు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో ఉన్న మరో ఫోటోను లక్ష్మీ ట్వీట్ చేశారు. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ప్రస్తుతం ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. We definitely could not miss this for the world! Surprised Nana in Chennai as he received his honorary doctorate from MGR University ❤ pic.twitter.com/pMYDkX8WZm — Lakshmi Manchu (@LakshmiManchu) 4 October 2017 -
చానళ్ల పాత్ర ప్రశంసనీయం
సాక్షి, సిటీబ్యూరో: పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే బాధ్యతను తెలుగు టీవీ చానళ్లు తీసుకోవడం ప్రశంసనీయమని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో గురువారం సాయంత్రం ఏడో యూనిసెఫ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన మంచులక్ష్మి మాట్లాడుతూ...పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సంరక్షణ తదితర అంశాలపై టెలివిజన్ చానళ్లు కథనాలు ప్రసారం చేసి పిల్లల సమస్యల గొంతుకగా మారడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గోపాల కృష్ణ గోఖలే అవార్డు గ్రహీత ఎస్.ఉమాపతి మాట్లాడుతూ... టీవీ చానళ్లలో ప్రసారమైన పిల్లల సమస్యల కథనాలు బాగున్నాయని, అయితే వీటికి న్యాయ సంబంధమైన అభిప్రాయాలు కూడా చొప్పిస్తే అర్థవంతంగా ఉంటుందన్నారు. అవార్డులు అందుకున్న చానళ్లివే.. ఐ న్యూస్ (స్ఫూర్తిదాయకం ఇంటర్ బాలిక-అనూష శీర్షికతో కథనం), టీవీ9(పసి వయస్సులో ప్రాణాంతక చక్కెర వ్యాధి), వీ6(సమస్యల మండటం గట్టు కథనం), జెమినీ న్యూస్(అమ్మానాన్న దూరమైతే..), ఈటీవీ ఏపీ(డిటెన్షన్ అవసరమా, అనర్థమా..?పై చర్చ, ర్యాగిం గ్ రాక్షసిపై కథనం), హెచ్ఎంటీవీ(దేవరకొండ అమ్మాయిలు), వనిత టీవీ(అక్షరధామం...హతునూర్ మండలం అనే కథనం), 10 టీవీ(మాతాశిశు మరణాలపై కథనం)లకు అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల యూనిసెఫ్ ఆఫీస్ చీఫ్ ఫీల్డ్ రూత్ లియోనో, సీఎంఎస్ డెరైక్టర్ పీఎన్ వసంతి పాల్గొన్నారు. -
చిరంజీవి బర్త్ డే ఎక్స్ క్లూజివ్ ఫోటో
హైదరాబాద్: తెరకు తాత్కాలికంగా దూరమైనా తనలో జోరు ఏమాత్రం తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. ఈ తరం నటులతో సమానంగా డాన్స్ చేయగల సత్తా ఉందని రుజువు చేశారు. చిరంజీవి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు హీరో రామ్ చరణ్ శనివారం ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రరంగాలకు చెందిన సినిమా ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు విషెస్ చెప్పడానికి వచ్చిన సినిమా తారలతో చిరంజీవి ఉత్సాహంగా గడిపారు. వారితో కలిసి ఆడిపాడారు. చిరు హుషారుగా డాన్స్ చేస్తున్న ఫోటో 'సాక్షి' సంపాయించింది. సీనియర్ నటుడు మోహన్ బాబు తనయ లక్ష్మీప్రసన్న ఆయనతో పాదం కలిపారు. చిరుతో సమానంగా నృత్యం చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్, బ్రహ్మజీ కూడా 'అన్నయ్య'తో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు. 'చిరు' స్టెప్పులకు మిగతావారంతా జత కలవడంతో సెలబ్రేషన్ సందడిగా సాగింది. అయితే చిరంజీవి డాన్స్ చూసినవారంతా ఆయన స్టెప్పుల్లో సొగసు ఏమాత్రం తగ్గలేదని అనుకున్నారు. -
నిర్మాత బెల్లంకొండ ఇంటి ముందు మంచు లక్ష్మీ అనుచరుల ధర్నా
బంజారాహిల్స్: తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ రభస సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుకున్న ప్రకారం... డబ్బులు ఇవ్వడానికి బెల్లంకొండ సురేశ్ వెనుకడుగు వేశారని మంచు లక్ష్మి అనుచరులు ఆరోపిస్తున్నారు. రభస సినిమా బుధవారం విడుదలవుతుంది. తమ డబ్బులు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వీరంతా సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు
దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని ఏదో పనిగా భావించకండి. జాతి పునర్నిర్మాణంలో మనవంతు కనీస బాధ్యతగా గుర్తించండి. జాతిపిత మహా త్మాగాంధీ చెప్పినట్టు అహింసాయుతమైన ప్రజాస్వామ్యంలో ఓటే ఏకైక ఆయుధం. ఆ ఓటును సద్వినియోగం చేసుకోండి. కులాలు, మతాలు, వేర్పాటువాదాలకు అతీతంగా సమర్థులైన నేతలనే ఎన్నుకోండి. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలన్నీ ఓమారు చూసి, ఆయా పార్టీల నేతల ప్రకటనలు గమనించి ఎవరైతే సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారని భావిస్తారో అలాంటి నేతలనే ఎన్నుకోండి... - మంచు లక్ష్మీప్రసన్న -
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్