Netflix Unveils The "Pitta Kathalu" Series Official Teaser | నలుగురు హీరోయిన్లతో ‘పిట్ట కథలు’ - Sakshi
Sakshi News home page

నలుగురు హీరోయిన్లతో ‘పిట్ట కథలు’.. టీజర్‌ ఇదిగో

Published Wed, Jan 20 2021 1:08 PM | Last Updated on Wed, Jan 20 2021 2:36 PM

Pitta Kathalu Teaser Out - Sakshi

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘లస్ట్‌ సోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ తెలుగులో ‘పిట్ట కథలు’పేరుతో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మొత్తం నాలుగు కథలుగా ఉన్న ఈ సీరిస్‌ని నలుగు దర్శకులు తెలుగులో రీమేక్‌ చేశారు. తరుణ్‌ భాస్కర్‌(పెళ్లి చూపులు ఫేమ్‌), నందిని రెడ్డి(‘ఓ బేబీ’ఫేమ్‌), నాగ్‌ అశ్విన్‌ (‘మహానటి’ఫేమ్‌), సంకల్ప్‌ రెడ్డి(‘ఘాజీ’ఫేమ్‌)లు తెరకెక్కించిన ఈ పిట్టకథలు సిరీస్‌ టీజర్‌ బుధవారం విడుదలైంది.

మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్, జగపతిబాబు, సత్యదేవ్, మేఘన, సంజిత్ హెగ్డే  నటించిన ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సిరీస్ కథాంశమే బోల్డ్ కాబట్టి, టీజర్ లో అది ఏ లెవెల్లో ఉంటుందో చూపించారు. నాలుగు విభిన్న కథలు కలిగిన మహిళలు వారి జీవితానికి చెందిన ప్రేమ, ఎమోషన్స్ వాటికి వారి నలుగురికి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటి అన్నదే ఈ సిరీస్‌ కథాంశం. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘పిట్ట కథలు’ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమ్ కానుంది. మరి హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement