Netflix Pitta Kathalu Movie Official Trailer Released | బోల్డ్‌గా ‘పిట్టకథలు’ ట్రైలర్‌ - Sakshi
Sakshi News home page

బోల్డ్‌గా ‘పిట్టకథలు’ ట్రైలర్‌

Published Fri, Feb 5 2021 5:35 PM | Last Updated on Fri, Feb 5 2021 7:03 PM

Pitta Kathalu Official Trailer Out In Netflix - Sakshi

నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందించిన పిట్ట కథలు వెబ్‌ సిరీస్‌ తెలుగులో ఈనెల 19 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్‌ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. పిట్టకథలు.. పేరుకు తగ్గట్లే నలుగురు మహిళలకు చెందిన నాలుగు చిన్న కథల సమూహారంగా తెరకెక్కించారు. ఇందులో శ్రుతీ హాసన్‌, ఈషా రెబ్బా, అమలాపాల్‌, సాన్వే మేఘన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నలుగురు అవార్డ్‌ విన్నింగ్‌ తరుణ్‌ భాస్కర్‌, నందిని రెడ్డి, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, లక్ష్మీ మంచు, సంజిత్ హెగ్డే, సత్యదేవ్‌, అశ్విన్ కాకుమను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాలుగు కథలు వేరే అయినప్పటికీ వీటిని నడిపించేది మాత్రం ప్రేమ, కామం, ద్రోహం, కన్నీళ్లు వంటి భావోద్వేగాలే. 

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. బోల్డ్ క‌థాంశంతో సాగుతున్న ట్రైలర్‌ రొమాంటిక్, కన్నీళ్లు, సీరియ‌స్ స‌న్నివేశాల మేళ‌వింపుతో కూడుకొని ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్ర‌లు చాలా మేరకు ఎమోషనల్‌, బోల్డ్‌, రొమాంటిక్ క‌నిపిస్తున్నాయి. మొత్తానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ ఆధ్యంతం అద్భుతంగా, ఉత్కంఠంగా సాగింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కచ్చితంగా ఈ పిట్ట క‌థ‌లు ఓ కొత్త అనుభూతి ఇస్తుంద‌న్న విషయం ట్రైలర్‌ చూస్తే అర్థ‌మ‌వుతుంది. టేకింగ్‌లో.. మ‌నం కొన్ని అడుగులు ముందుకేసి ‘నెట్ ఫ్లిక్స్’ స్థాయిని అందుకున్నామ‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది. న‌లుగురు ద‌ర్శ‌కులు తొలిసారి ప‌లు క‌థ‌ల స‌మాహారంతో తీస్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో అమితాసక్తి నెల‌కొంది. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న పిట్ట‌క‌థ‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 19న ప్రీమియ‌ర్ కానుంది.
చదవండి: వీరిలో నా డార్లింగ్‌ ఎవరబ్బా: కాజల్‌ భర్త

ఈ ట్రైలర్‌ను ట్విట్టర్‌లో మంచు లక్ష్మీ షేర్ చేశారు. ‘సమాజ నిబంధనలను సవాలు చేస్తూ నలుగురు విభిన్న మహిళల నాలుగు అసాధారణ ప్రయాణాలను తీసుకు వస్తోంది. ఈ సినిమాలో నేనూ భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ‘స్వరూపక్క’ గా మీ ముందుకు రావడనికి ఇక ఆలస్యం చేయలేను.’ అంటూ ట్వీట్‌ చేశారు. మ‌రి ఈ నాలుగు క‌థ‌లూ ఎలా ఉంటాయో? నాలుగు క‌థ‌ల్లో ఏది అమితంగా ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే.. 19 వ‌ర‌కూ ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement