చిరంజీవి బర్త్ డే ఎక్స్ క్లూజివ్ ఫోటో | chiranjeevi 60th birthday exclusive photo | Sakshi
Sakshi News home page

చిరంజీవి బర్త్ డే ఎక్స్ క్లూజివ్ ఫోటో

Published Tue, Aug 25 2015 6:05 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

చిరంజీవి బర్త్ డే ఎక్స్ క్లూజివ్ ఫోటో - Sakshi

చిరంజీవి బర్త్ డే ఎక్స్ క్లూజివ్ ఫోటో

హైదరాబాద్: తెరకు తాత్కాలికంగా దూరమైనా తనలో జోరు ఏమాత్రం తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. ఈ తరం నటులతో సమానంగా డాన్స్ చేయగల సత్తా ఉందని రుజువు చేశారు. చిరంజీవి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు హీరో రామ్ చరణ్ శనివారం ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రరంగాలకు చెందిన సినిమా ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. చిరంజీవికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తనకు విషెస్ చెప్పడానికి వచ్చిన సినిమా తారలతో చిరంజీవి ఉత్సాహంగా గడిపారు. వారితో కలిసి ఆడిపాడారు. చిరు హుషారుగా డాన్స్ చేస్తున్న ఫోటో 'సాక్షి' సంపాయించింది. సీనియర్ నటుడు మోహన్ బాబు తనయ లక్ష్మీప్రసన్న ఆయనతో పాదం కలిపారు. చిరుతో సమానంగా నృత్యం చేశారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్, బ్రహ్మజీ కూడా 'అన్నయ్య'తో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు. 'చిరు' స్టెప్పులకు మిగతావారంతా జత కలవడంతో సెలబ్రేషన్ సందడిగా సాగింది. అయితే చిరంజీవి డాన్స్ చూసినవారంతా ఆయన స్టెప్పుల్లో సొగసు ఏమాత్రం తగ్గలేదని అనుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement