డైలాగ్ కింగ్ మోహన్‌బాబు నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా విలక్షణ గొంతుతో అభిమానులకు చేరువయ్యారు. ఇటీవలే తన కూతురుతో కలిసి యూట్యూబ్‌లో ‘చిట్టి చిలకమ్మ’ అనే ఛానల్ పెట్టిన లక్ష్మీ.. పిల్లల పెంపకంపై వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఆమె తన తండ్రి మోహన్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హీరో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘భక్త వత్సలం నాయుడు’. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఈ విషయాన్ని ఓ నెటిజన్ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు. నాన్న తన సొంత పేరుతో సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికీ తెలియదంటూ పేర్కొన్నారు. ‘ఓహ్ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించాడని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’ అంటూ ట్వీట్ చేశారు.
Ohh I didn’t know he used his birth name. How cool AND just how handsome is appa in that uniform. @Suriya_offl my special mention with graphics better be there!🥳🥳🥳 @themohanbabu my daddy is the awesomest! https://t.co/BPOCo4QH30
— Lakshmi Manchu (@LakshmiManchu) February 28, 2020
Comments
Please login to add a commentAdd a comment