మనోజ్‌కు రాఖీ కట్టిన మంచు లక్ష్మి.. మరి విష్ణు ఎక్కడ? | Lakshmi Manchu Ties Rakhi To Manchu Manoj, Netizens Comments Where Is Manchu Vishnu - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi Prasanna: ఫోటో షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..?

Published Fri, Sep 1 2023 3:34 PM | Last Updated on Fri, Sep 1 2023 4:09 PM

Manchu Lakshmi Manchu Ties Rakhi To Manchu Manoj, Netizens Comments Where Is Manchu Vishnu - Sakshi

మంచు మనోజ్‌కు రాఖీ కట్టిన లక్ష్మి వారితో కలిసి ఓ రెస్టారెంట్‌లో లంచ్‌ చేసింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 'ప్రేమ, సరదా, రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్‌ జరిగింది'

మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని వాళ్లు చెప్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో వారి మధ్య ఉన్న గొడవలు, డిస్టబెన్స్‌ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మనోజ్‌ అనుచరుడిపై విష్ణు గొడవకు దిగిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మనోజ్‌ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడే కనిపించలేదు.

విష్ణు ఫ్యామిలీ సమయానికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి అతిథిలా వచ్చి వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. అటు మంచు లక్ష్మి మాత్రం తమ్ముడి పెళ్లిని భుజాన వేసుకుని స్వయంగా తన ఇంట్లోనే జరిపించింది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసి మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఫోటో మరోసారి ఈ ఊహాగానాలకు తెర లేపింది.

మంచు మనోజ్‌కు రాఖీ కట్టిన లక్ష్మి వారితో కలిసి ఓ రెస్టారెంట్‌లో లంచ్‌ చేసింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 'ప్రేమ, సరదా, రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్‌ జరిగింది' అని రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోల్లో మంచు విష్ణు లేడు. ఇది చూసిన జనాలు అంతా బానే ఉంది.. కానీ, మంచు విష్ణు ఎక్కడ? అని కామెంట్లు చేస్తున్నారు. విష్ణుకు రాఖీ కట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాఖీ లంచ్‌ అంటూ మనోజ్‌తో మాత్రమే దిగిన ఫోటోనే షేర్‌ చేసిందంటే విష్ణుకు రాఖీ కట్టనట్లుంది అని అభిప్రాయపడుతున్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతోందని అనుమానిస్తున్నారు.

చదవండి: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సి ఉండగా నటి ఇంట విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement