సాక్షి, హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్.. తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్‌బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తిపైనా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు.
ఏం జరిగిందంటే?
కాగా డిసెంబర్ 8న మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరలవగా.. అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఓ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్‌పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్‌బాబు, మనోజ్ (Manchu Manoj) ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు.. తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశాడు.
మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్‌లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.
చదవండి: శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్
Comments
Please login to add a commentAdd a comment