ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్స్ ఒకరికొకరు సరదా ఛాలెంజ్ విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మోహన్ బాబుకి ‘కుకింగ్ ఛాలెంజ్’ విసిరారు ‘కళాబంధు’ సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్ బాబు.. మనవరాలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) తో కలసి స్పెషల్ మసాలా వడలు తయారు చేశారు. ‘‘నా ఆత్మీయుడు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి గారి కుమార్తె నేను వంట చేసి చూపించాలని నాకు సవాల్ విసిరింది, స్పెషల్ వడలు చేస్తా’’ అంటూ వంట చేస్తున్న వీడియోను షేర్ చేశారు మోహన్ బాబు. తాతయ్య వంట చేస్తుంటే విద్యా నిర్వాణ సహాయం చేస్తూ కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment