అంతా బాగుంటాంరా | Manchu Manoj IS Antha Baguntamra Video Song Released by KTR | Sakshi
Sakshi News home page

అంతా బాగుంటాంరా

Published Mon, Apr 20 2020 4:43 AM | Last Updated on Mon, Apr 20 2020 4:43 AM

Manchu Manoj IS Antha Baguntamra Video Song Released by KTR - Sakshi

కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య, పోలీస్‌ సిబ్బంది కృషిని అభినందిస్తూ మంచు మనోజ్‌ ఓ పాటను విడుదల చేశారు. ‘‘అంతా బాగుంటాంరా ...’’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రచించగా, అచ్చు కంపోజ్‌ చేశారు. తన మేనకోడలు విద్యా నిర్వాణతో (మంచు లక్ష్మి కుమార్తె) కలసి ఈ పాటను పాడారు మంచు మనోజ్‌. ఆదివారం ఈ పాటను  మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఈ పాట కొందరి మనస్సులో అయినా ఆశను, స్ఫూర్తిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మనోజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement