డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిథి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.`చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను. అందుకే విధ్యకి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించాను. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నాను. కానీ విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తన తల్లిగా ఎంతో గర్వంగా ఉంద’ని లక్ష్మీ అన్నారు.‘సో ఫ్రౌడ్ ఆఫ్ యూ మై యాపిల్’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. `నాకు చెస్ ఆడడం ఇప్పటికీ తెలీదు. అటువంటిది మా మనవరాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పినప్పుడు ఎందుకమ్మా ఇవన్ని చక్కగా చదువుకోనివ్వు అని అన్నాను. లేదు డాడి తను చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా మనవరాలు ఈ రికార్డు సాధించడం సంతోషాన్ని కలిగిస్తోంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment