నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్‌చూర్ ధర రికార్డు స్థాయిలో మంగళవారం క్వింటాలుకు రూ.36,900 పలికింది. మామిడి కాత తక్కువగా ఉండటంతో ఈ ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే ఆమ్‌చూర్ కొనుగోళ్లు జరుగుతాయి.
మార్కెట్ యార్డుకు నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కర్ణాటక రాష్ట్రం ఔరాద్ నుంచి మొత్తం 373 క్వింటాళ్ల ఆమ్‌చూర్ నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. ఈ నెలాఖరుకు ఆమ్‌చూర్ క్వింటాలు ధర రూ.40 వేల పైచిలుకు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇతర దేశాల్లో చింతపండుకు బదులుగా పులుపుకోసం ఆమ్‌చూర్‌ను వాడుతారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment