breaking news
Nizamabad Market
-
నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు విషయంలో రాష్ట్రంలో పెద్దదైన నిజామాబాద్ మార్కెట్‌కు ప్రస్తుత సీజన్లో భారీగా పసుపు వస్తోంది. నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాల్లో పసుపు సాగు విస్తీర్ణంతో పాటు దిగబడులు సైతం పెరిగాయి. రాష్ట్రంలో పండుతున్న పసుపులో దాదాపు 70 నుంచి 80 శాతం పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వస్తుంది. ఇక 2023–24 సీజన్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్) నెలల్లో ఇందూరు మార్కెట్‌కు 4,55,398 క్వింటాళ్ల పసుపు వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8,55,516 క్వింటాళ్లు, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8,38,932 క్వింటాళ్లు, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7,49,072 క్వింటాళ్లు, 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 7,23,470 క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7,59,915 క్వింటాళ్ల పసుపు ఇందూరు మార్కెట్‌కు వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,37,947 క్వింటాళ్ల పసుపు వచ్చింది. గత సీజన్లో రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది తెగుళ్లు సోకకపోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల ఎక రాల్లో పసుపు సాగు చేయగా.. ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లా రైతులు సాగు చేశా రు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లా రైతులు 22 వేల ఎకరాల పసుపు సాగు చేశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పసుపు ధక అత్యధికంగా క్వింటాకు రూ.15,800 పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.13,949 ధర పలుకుతోంది. నిజామాబాద్ మార్కెట్లో తేమ శాతం, కర్కుమిన్ శాతం సైతం తీస్తున్నారు. ఇక కర్కుమిన్ 3 శాతం ఉంటుందని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో.. ఈసారి రైతులు పసుపు సాగుకు మొగ్గు చూపడంతో విస్తీర్ణం పెరిగింది. పైగా గత ఏడాది సగటున పసుపు ధర రూ.18 వేల వరకు పలికింది. సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని అధికారులు తెలిపారు. -
‘ఎర్ర గుంటూరు’ సాగు.. ఎంతో బాగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పంట కొనుగోళ్లలో రాష్ట్రంలోనే 70 శాతం వాటా కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ప్రత్యేకత ఉంది. కానీ ఇక్కడికి వచ్చే పసుపు రకాల విషయానికి వస్తే 99 శాతం ‘ఎర్ర గుంటూరు’(ఆర్మూర్ రకం) ఉండటం విశేషం. నిజామాబాద్ జిల్లా తరువాత.. పసుపు ఎక్కువగా సాగు చేస్తున్న జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఎర్రగుంటూరు రకం వంగడాన్నే అత్యధిక శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ‘దుగ్గిరాల ఎరుపు’రకం వంగడాన్ని తీసుకొచ్చి కమ్మర్పల్లి పరిశోధన కేంద్రంలో మరింత అభివృద్ధి చేశారు. అప్పటినుంచి దీన్ని ఎర్ర గుంటూరు (ఆర్మూర్ రకం)గా పిలుస్తున్నారు. ‘ఎర్ర గుంటూరు’రకం వంగడం ఇక్కడి నేలకు సరిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్ 3 శాతం లోపే ఉంటోంది. కాగా కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే సోనాలి, రాజేంద్రసోని (బిహార్), పీతాంబర్ (ఉత్తరప్రదేశ్) రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. రైతులు మాత్రం స్థానికంగా అభివృద్ధి చేసిన ‘ఎర్ర గుంటూరు’రకం వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం 6 నెలల్లోనే పంట వచ్చే ప్రగతి, ప్రతిభ (కేరళ) పొట్టి రకాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, ఈ రకాల్లో పసుపు బరువు ఎక్కువగా రావడం లేదని రైతులు ఆసక్తి చూపడం లేదు.చూసేందుకు మంచిగా, ధర ఎక్కువగా పలికే ‘ఎర్ర గుంటూరు’రకమే మేలని రైతులు అంటున్నారు. దుంప ఎక్కువగా వచ్చే తమిళనాడు సేలం రకం వంగడాన్ని సైతం నామమాత్రంగానే సాగు చేస్తున్నారు. అయితే చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాజాపురి, సేలం, పీతాంబర్ రకాలను రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ రకాల్లో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా ‘ఎర్ర గుంటూరు’రకం పసుపును దేశీయంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బంగ్లాదేశ్, ఇరాన్, అరబ్ దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. 13 రకాలపై పరిశోధన రాష్ట్రంలో ఏకైక కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం 13 రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక కర్కుమిన్, దిగుబడి ఎక్కువ, తెగుళ్ల నివారణ, కీటకాలు, పురుగు నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో.. పరిశోధనలకు భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్) నుంచి సూచనలు వస్తాయి. కేరళలోని ఆలిండియా కో–ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ స్పైసెస్ (ఏఐసీఆర్పీ)తో సమన్వయం చేసుకుంటూ.. కొన్ని పరిశోధనలు, రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మరికొన్ని పరిశోధనలు ఇక్కడ చేస్తున్నారు. 40 శాతం సాగు నిజామాబాద్ జిల్లాలో.. రాష్ట్రంలో అత్యధికంగా 40 శాతం నిజామాబాద్ జిల్లాలో సాగవుతోంది. తరువాత స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్‌కు 2019–20లో 10,78,821 క్వింటాళ్ల పసుçపు వచ్చింది. 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021–22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు వచ్చిoది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,74,055 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చిoది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసుపు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 50 వేల క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్ల పసుపు ఇక్కడి మార్కెట్‌కు రానున్నట్లు అధికారుల అంచనా. గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిoది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లాలో 22 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. -
నిజామాబాద్ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న పసుపు రైతులు
-
రికార్డు స్థాయిలో ధరలు.. ఆమ్చూర్ క్వింటాలుకు రూ.36,900..కారణమిదే!
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్చూర్ ధర రికార్డు స్థాయిలో మంగళవారం క్వింటాలుకు రూ.36,900 పలికింది. మామిడి కాత తక్కువగా ఉండటంతో ఈ ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే ఆమ్చూర్ కొనుగోళ్లు జరుగుతాయి. మార్కెట్ యార్డుకు నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కర్ణాటక రాష్ట్రం ఔరాద్ నుంచి మొత్తం 373 క్వింటాళ్ల ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. ఈ నెలాఖరుకు ఆమ్చూర్ క్వింటాలు ధర రూ.40 వేల పైచిలుకు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇతర దేశాల్లో చింతపండుకు బదులుగా పులుపుకోసం ఆమ్‌చూర్‌ను వాడుతారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ధర దగా
నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అక్కడి వ్యాపారులు క్వింటాలు పసుపునకు అధిక ధర చెల్లిస్తుండగా, ఇక్కడి వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. సిండికేట్‌గా మారిన గుప్పెడు మంది వ్యాపారులు చెప్పిన ధరకే ఇతర వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మార్కెట్‌కు పసుపు తరలించిన రైతులు లబోదిబోమంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఈ–నామ్ విధానం.. దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం.. తద్వారా విస్తృతమైన మార్కెట్ ఏర్పడి రైతుల ఉత్పత్తులకు మంచి ధర.. ఈ–నామ్ క్రయవిక్రయాల విధానంపై ప్రభుత్వం చెబుతున్న మాటలివి... కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుప్పెడు మంది వ్యాపారులు నిర్ణయించిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ యార్డు లో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజామాబాద్‌కు ప్రత్యామ్నాయమైన పసుపు మార్కెట్ సాంగ్లీ (మహారాష్ట్ర)లో వ్యాపారులు క్వింటాలుకు సగటున రూ.9,500 వరకు చెల్లిస్తే.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో మాత్రం కేవలం రూ.6,300లతో సరిపెడుతున్నారు. అంటే క్వింటాలుకు రూ.3,200 వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌యార్డుకు పసుపు తెచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను విక్రయిస్తే.. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ యార్డులో లైసెన్సులున్న ఖరీదుదారులు 423 మంది ఉండగా, వీరిలో 40 మంది మాత్రమే పసుపు కొనుగో లు చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది వ్యాపారులు నిర్ణయించిన ధర మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నాణ్యత పేరుతో.. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. సాంగ్లీ మార్కెట్‌కు రాజ్‌పురి రకం అని.. ఈ రకం పసుపులో కర్కుమిన్ శాతం అధికంగా ఉండటంతో అక్కడి వ్యాపారులు ఆ పసుపునకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ రకంతో పోల్చితే నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపు నాణ్యత తక్కువ ఉంటుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. పైగా అక్కడి మార్కెట్‌కు వచ్చే పసుపులో పాలిష్ ఎక్కువగా జరుగుతుందని, నిజామాబాద్ యార్డుకు వస్తున్న పసుపునకు ఆ నాణ్యత ఉండదని పేర్కొంటున్నారు. మరోపక్క వ్యాపారులు సిండికేట్ కావడానికి అవకాశమే లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ముంచెత్తిన పసుపు.. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు ముంచెత్తింది. సోమవారం సుమారు 35వేల బస్తాల పసుపును మార్కెట్‌కు తీసుకువచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజు కావడంతో ఒక్కసారిగా పసుపు మార్కెట్‌కు తరలివచ్చింది. కాగా గతేడాదితో పోల్చితే నిజామాబాద్ యార్డుకు పసుపు పక్షం రోజుల ముందుగానే వస్తోంది. సాధారణంగా జనవరి చివరి వారంలో రైతులు పసుపును యార్డుకు తీసుకువస్తారు. కానీ ఈసారి జనవరి మొదటి వారం నుంచే తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 వేల క్వింటాళ్ల పసుపు యార్డుకు వచ్చింది. గతేడాది ఇదేరోజు నాటికి 40 వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్‌యార్డు రికార్డులు చెబుతున్నాయి. -
కృషికి గుర్తింపు
ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ ఈ–నామ్ అమలులో దేశంలోనే మొదటి స్థానం కలెక్టరేట్లో అవార్డు ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్ ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో నిజామాబాద్ మార్కెట్ యార్డు ఉత్తమ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ యోగితారాణా ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్–2017 అవార్డు అందుకున్నారు. అలాగే ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల బహుమతిని పొందారు. ఈ–నామ్ అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి సంగయ్య, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, జిల్లా ఆడిట్ అధికారి రాము ఢిల్లీకి వెళ్లారు. అయితే కలెక్టర్ ఉత్తమ అవార్డును పొందే దృశ్యాలను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రగతిభవన్‌లో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, ఈ– నామ్ ఇన్చార్జి ఎల్లయ్య, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్చార్జి డీఆర్వో రమేష్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఉద్యోగులు ప్రొజెక్టర్ల ద్వారా దృశ్యాలను వీక్షించారు. కలెక్టర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇద్దరు ప్రధాని చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న సమయంలో ప్రగతిభవన్‌లో ఉన్న అధికారులు, ఉద్యోగులు అంతా లేచి చప్పట్లు కొట్టారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే కలెక్టర్‌కు పలువురు అధికారులు వాట్సప్‌లో శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌పై ప్రశంసల జల్లు అవార్డు ప్రదానోత్సవం ముగిసిన అనంతరం ప్రగతిభవనలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ యోగితారాణాపై ప్రశంసల జల్లు కురిపించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లా అధికారులు ఒక్కొక్కరుగా కలెక్టర్ చేస్తున్న కృషిని వెల్లడించారు. కలెక్టర్ తన పాలన కాలంలో శాఖలవారీగా సాధించిన పురోగతి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల శాతం పెంపు, ఫసల్ బీమా యోజన అమలులో క్షేత్రస్థాయి పరిశీలన తదితర ప్రగతి సాధించిన పథకాలపై మాట్లాడారు. కలెక్టర్ యోగితారాణా జిల్లాకు రావడం మన మందరం, ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు. -
నిజమాబాద్ మార్కెట్లో దగా
► చార్జీల పేరిట భారీగా వసూళ్లు ► క్వింటాల్‌కు రూ.400 ఖర్చు జగిత్యాల అగ్రికల్చర్ ( ఆదిలాబాద్): జిల్లాలో పసుపు మార్కెట్ లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను నిజామాబాద్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులు మార్కెట్లో ఛార్జీల పేరిట రైతులను దోచుకుంటున్నారు. క్యాష్ కటింగ్, అడ్తి, హమాలీ ఛార్జీల పేరున మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు. మార్కెట్ ఫీజు ఎగవేసేందుకు, తెల్లకాగితాలపై పద్దులు రాసి ఇస్తున్నారు. జగిత్యాల డివిజన్లోని జగిత్యాల కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్ మండలాల్లో పసుపును అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. జిల్లాలో సాగు అయ్యే పంటల్లో దాదాపు 75 శాతం ఈ మండలాల నుండే ఉంటుంది. ప్రస్తుతం పసుపు పంట తవ్వి, ఉడకబెట్టి, ఆరబెట్టి, పాలిషింగ్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్ రేటు రూ.6-7 వేల మధ్యనే పలుకుతుంది. ధరలు తక్కువగా ఉండటంతో పాటు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా, ఆ స్థాయిలో రేట్లు పెరగడం లేదు. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల నిజమాబాద్ మార్కెట్‌కు వెళ్లిన జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు తీపిరెడ్డి రత్నాకర్‌రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నాడు. 31 క్వింటాళ్లకు రూ.13వేల ఖర్చు రత్నాకర్ రెడ్డి అనే రైతు తనకు పండిన 31.64 క్వింటాళ్ల పసుపు పంటను రెండు రోజుల క్రితం నిజమాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఓపెన్ మార్కెట్లో ధర క్వింటాల్‌కు రూ 6500 ధర పలికింది. రైతు లెక్క ప్రకారం రూ. 2,05,660 డబ్బులు రావాలి. కాని, తన డబ్బులు తనకు ఇచ్చేందుకు, వడ్డీకి ఇచ్చినట్లుగా క్యాష్ కటింగ్ పేర, వచ్చిన డబ్బుల్లో రూ 4,113 (2 శాతం), అలాగే అడ్తి, హమాలీ, దించిన కూలీ, కుప్ప పోసిన కూలీ, చాట పేరిట రూ 4,774 (దాదాపు 2.3 శాతం), పసుపు ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు సంచి కిరాయి (ఒక్క బస్తాకు రూ 8) రూ 384, ఒక్క బస్తాకు నిజమాబాద్‌కు లారీ కిరాయి (ఒక్క బస్తాకు రూ 65) రూ 3120 ఇలా రైతుకు రూ 12,391 ఖర్చు వచ్చింది. రెండు రోజుల పాటు భోజన ఖర్చు, రవాణా పేరిట మరో రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. అంటే, రైతుకు మొత్తంగా రూ 13,391 ఖర్చు వచ్చింది. రైతుకు వచ్చిన మొత్తం డబ్బు రూ 2,05,660 నుండి, రైతు ఖర్చు రూ 13,391 తీసివేయగా, చేతికి వచ్చింది రూ 1,92,269. వర్షాభావ పరిస్థితుల్లో రైతు ఏడాది పాటు కష్టపడి పండించిన పంటను మార్కెట్లో నిలువు దోపిడి చేస్తున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు జిల్లా నుండి పసుపు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏ రేటు ఎంత అని అడిగినా ఎ వ్వరు పట్టించుకోవడం లేదు. తెల్లకాగితాలపై ఇష్టం వచ్చినట్లు కట్ చేసి, మిగిలిన డబ్బులను చేతిలో పెడుతున్నారు. - తీపిరెడ్డి రత్నాకర్‌రెడ్డి, పసుపు రైతు మా డబ్బులు మాకు ఇవ్వమంటే క్యాష్ కటింగ్ పసుపును అమ్మిన డబ్బులను మాకు ఇవ్వమంటే నూటికి రెం డు రూపాయలు క్యాష్ కటింగ్ చేస్తున్నారు. ఏ మార్కెట్ నిబంధనలో క్యాష్ కటింగ్ లేదు. రైతుల దగ్గర బలవంతంగా దోచుకుంటున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. - తిరుపతి రెడ్డి, లక్ష్మీపూర్ -
పసుపు రైతుకు ధరాఘాతం
ఎన్నో ఆశలతో పంటసాగు చేసిన పసుపు రైతుకు ధరాఘాతం తగులుతోంది. మార్కెట్లో క్వింటాలు పసుపు పంటకు రూ. 6,200 ధర మాత్రమే లభిస్తుండడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. కనీసం రూ. 8 వేలు పలికితేనే పెట్టుబడులు తిరిగి వస్తాయని, లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ సబ్‌డివిజన్‌లోని మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, నం దిపేట్ మండలాల్లో పసుపు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25 వేల హెక్టార్లలో పసుపు సాగు చేశారు. గతేడాది పసుపు క్వింటాలుకు కనిష్ట ధర రూ.6500, గరిష్ట ధర రూ.10 వేలు లభించింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురియడంతో పంటకు దుంపకుళ్లు సోకి నష్టం వాటిల్లింది. దిగుబడి తగ్గినందున మార్కెట్లో పసుపు పంటకు కొరత ఉంటుందని, దర పెరుగుతుందని రైతులు ఆశించారు. అయి తే పసుపు ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేక పోవడం, మార్కెట్లోని వ్యాపారుల చేతిలోనే ధర నిర్ణయాధికారం ఉండటంతో రైతులకు లా భం కలగడం లేదు. పసుపు పంటకు మద్దతు ధర లేనందున మార్కెట్ ఇన్వెన్షన్ స్కీంను వర్తింప చేసి ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేసే అధికారాన్ని తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మద్దతు ధర కోసం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో రైతులు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయితే పసుపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పసుపు పంట చేతికి వస్తోంది. దీంతో రైతులు నిజామాబాద్ మార్కెట్‌కు పం టను తరలిస్తున్నారు. అక్కడికి వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. క్వింటాలు పసుపు పం టకు రూ. 6,200 ధర లభిసోంది. జాతీయ మార్కెట్ ఆయిన మహారాష్ట్రలోని సాంగ్లీలో మాత్రం నిలువ ఉంచిన పసుపు పంటకు కొద్ది గా ఎక్కువ ధర లభిస్తోంది. క్వింటాలు పసుపు గరిష్టంగా రూ. 7,500 పలుకుతోంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పసుపు రైతుల సమస్యలను ప్రస్తావించకపోవడం రైతులను కుంగదీస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే పసుపు రైతులు కష్టాలు పడుతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం. మా విన్నపాలన్నింటినీ పాలకులు బుట్టదాఖలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలి. పసుపు పంటకు మద్దతు ధర కోసం ఆర్మూర్‌లో త్వరలో జాతీయ స్థాయి రైతు నాయకులతో బహిరంగ సభ నిర్వహించనున్నాం. -కోటపాటి నర్సింహనాయుడు, స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర కోకన్వీనర్