మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కొన్ని డెజర్ట్‌లను మన ఆహారంలో భాగం చేసుకుంటే చాల రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాంటి డెజర్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ వెల్లడించిన ఉత్తమ డెజర్ట్‌ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ డెజర్ట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉనాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందట. అదెలాగా? దీన్ని ఎలా తయారు చేస్తారు?
ఆ డెజర్ట్ పేరు మామిడి స్టిక్కీ రైస్. ఇది థాయిలాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన డెడర్ట్. దీన్ని అక్కడ ప్రజలు మ్యాంగో స్టిక్కీ రైస్‌గా పిలుస్తారు. ఈ డెజర్ట్‌ని గ్లూటినస్ రైస్, తాజా మామిడిపండ్లు, కొబ్బరిపాలను మిళితం చేసి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ మంచి పోషక విలువలు కలిగినవి. ముందుగా ఇందులో ఉపయోగించే పదార్థాలు ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఇందులో ఉపయోగించే అన్నం
ఈ పాయసం చేయడానికి గ్లూటినస్ రైస్ ఉపయోగిస్తారు. దీనిలోని కార్బోహైడ్రేట్లకి మంచి డైట్‌కి ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. స్టిక్కీ రైస్‌లో కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అదీగాక అధిక రక్తపోటు లేదా బరువు సమస్యలు ఉన్నవారికి ఈ డెజర్ట్ గొప్ప ఔషధం.
కొబ్బరి పాలు
కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని నివారించే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతేగాదు ధమనులలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. గుండె జబ్బులకు దారితీసే రక్తంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలల్లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది.
మామిడి పండ్లు..
మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవన్నీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకునేలా రక్తపోటు స్థాయిలను తగ్గించి సాధారణ పల్స్‌ను ప్రోత్సహిస్తాయి. ఈ సమ్మర్ పండులో మాంగిఫెరిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. ఇది గుండె కణాల్లోని మంట, ఆక్సీకరణ ఒత్తిడి. కణాల నశించడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అంతేగాదు జంతు అధ్యయనాలు మాంగిఫెరిన్ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి.
ఈ డెజర్ట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈ పుడ్డింగ్ కడుపులో చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డెజర్ట్, మితంగా తింటే శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధి అవుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలంలో వివిధ కాలానుగుణ వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కంటి చూపును వృద్ధి చేస్తుంది
ఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి
డెజర్ట్ తయారీ..
ఒక పాన్‌లో బెల్లం పొడితో పాటు ఒక కప్పు కొబ్బరి పాలను వేసి, రెండు పదార్థాలు కలిసే వరకు వేడి చేయండి. అయితే, పాలల్లో బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద గిన్నెలో వండిన జిగురుతో కూడిన అన్నం తీసుకుని దానిపై ఈ కొబ్బరి పాలు గ్రేవీ సగం పోయాలి. దీన్ని బాగా కలపి ఒక గంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మామిడికాయ ముక్కను తీసుకుని ముక్కలు చేసి ఈ అన్నంలో వేశాక, మిగిలిన కొబ్బరిపాల గ్రేవిని ఇప్పుడు వేయాలి. చివరగా వేయించిన నువ్వులతో అందంగా అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టిక్కీ రైస్ మామిడి పాయసం రెడీ..!.
(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment