![Ali Not Get Mangoes From Pawan Kalyan This Year - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/2/ali-pawan-kalyan.jpg.webp?itok=9f3iVPS4)
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహానికి మంచి పేరుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. సినిమాల్లోనూ వాళ్లిద్దరూ ఒకే సీన్‌లో కనిపించారంటే కామెడీ పంట పండినట్టే. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. గతేడాది ఎన్నికల సమయంలోనూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఇంటిపట్టునే ఉంటున్న అలీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. పవన్ తనకు ప్రతి ఏడాది మామిడి పండ్లు పంపేవారని పేర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం తనకు మామిడి పండ్లు అందలేదని కాస్త నిరాశకు లోనయ్యారు. (అలీ @ కలామ్)
పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది పంపించలేదేమోనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదైనా వాటిని పంపుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి దగ్గర నుంచి ఆవకాయ పచ్చడి వచ్చేదన్నారు. కాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి అలీ చివరిసారిగా కాటమరాయుడు సినిమాలో కనిపించారు. ఇదిలా వుండగా దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో 'కలామ్' పాత్రను అలీ పోషిస్తున్నారు (నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు)
Comments
Please login to add a commentAdd a comment