
పండ్లలన్నింటిలో రారాజు మామిడి పండు. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక రుచి ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక విటమిన్లు, పోషకాలను కలిగి ఉంటుంది.
ముఖ్యంగా మామిడి పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, జింక్ మరియు కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడి పండ్ల సీజన్ పూర్తికాకముందే రుచికరమైన మంగోలీసియస్ డిజర్ట్‌ను ఇలా తయరుచేసుకోండి.
మంగోలీసియస్ డిజర్ట్ తయారికి కావాల్సినవి
మామిడి పండ్లు – రెండు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు
పిస్తాపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు
సేమియా – అరకప్పు
పాలు– నాలుగు కప్పులు
చక్కెర – పావు కప్పు
మంగోలీసియస్ డిజర్ట్ తయారీవిధానం ఇలా..
మామిడి పండు తొక్క, టెంక తీసేసి, ముక్కలుగా తరిగి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. టేబుల్ స్పూను నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో మిగతా నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియా వేగాక, పాలు పోసి పదినిమిషాలు కాగనివ్వాలి.
పాలు మరిగాక చక్కెర వేసి కరిగేంత వరకు తిప్పి దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన పాల మిశ్రమంలో మామిడి పండు ప్యూరీ, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. అరగంట తరువాత బయటకు తీసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment