
లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రటీలు ఎప్పటికప్పడు అభిమానులతో టచ్‌లో ఉంటూ పలు విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మామిడి కాయలపై తనకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు నేను కలుసుకున్న వాటిలో ది బెస్ట్ ఇదే అంటూ షేర్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు దీపికా..మీరు గర్భవతా? త‌్వరలో శుభవార్త చెబుతున్నారా? అంటూ దీపికాను ప్రశ్నించారు. (అయ్యో ! రణ్‌వీర్ ఎంత పని జరిగే..)
2018 డిసెంబర్‌లో దీపిక, రణ్‌వీర్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి దీపిక ప్రెగ్నెన్సీపై పలు పుకార్లు షికార్లు చేశాయి. వీటిలో నిజం లేదంటూ దీపిక స్పష్టతనిచ్చింది. ఇక లాక్‌డౌన్ సమయంలో దీపిక కొత్త కొత్త వంటలు ప్రయోగిస్తూ అభిమానులతో పంచుకుంటుంది. భర్త రణ్‌వీర్‌ను ఆటపట్టిస్తూ కరోనా సమయాన్ని సరదాగా గడుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment