పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్‌గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే..
ప్రయోజనాలు
- ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే
- ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే..
చుండ్రుకి చెక్‌పెడుతుంది
మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు.
టూత్ పౌడర్‌గా
మామిడిగింజల పౌడర్‌ని టూత్ పౌడర్‌గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
విరేచనాలకు ఔషధంగా
మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు.
ఒబెసిటీకి చక్కటి మందులా..
ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది
రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గుండె సంబంధిత వ్యాధులకు..
రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
డ్రై లిప్స్‌కి చెక్
పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్‌ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
మధుమేహం
మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.
మొటిమలు మాయం
మామిడి గింజలతో మొటిమల స్క్రబ్‌ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్‌హెడ్స్, బ్రేక్ అవుట్‌లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment