పండ్లలలో రారాజు మామిడి పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. భారతీయ వంటకాల్లో ఈ మామిడితో చేసే రెసిపీలు అగ్రభాగన ఉంటాయి. ఈ మామిడితో చేపల కూర నుంచి మామిడి స్మూతీస్ వరకు వివిధ రకాల ప్రత్యేక వంటకాలు ఉంటాయి. వేసవిలో సెలవులతో గడిపే పిల్లలు సైతం ఇష్టంగా తినే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. అలాంటి మామిడి పండు కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుకుంటున్నాం?. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?.
దీని వెనుకున్న చరిత్ర..
భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు ఉన్న సంబంధం ఐదు వేళ ఏళ్ల నాటిది. మామిడి అనే పేరు మలయన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు.
ఇది జీడిపప్పు, పిస్తాపప్పుల జాతికి చెంందిన అనాకార్డియోసికి చెందింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధ చెందిన పండ్లగా గుర్తించి ప్రతి ఏడాది జూలై 22న నేషనల్ మ్యాంగో డే జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
భారత్‌లో మామిడి రకాలు:
భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు..
మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.
మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మారియ విల్లరీల్ గాంజాలేజ్ పాల్గొన్నారు.
మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.
మామిడిలోని విటమిన్ 'ఏ' కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.
మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.
(చదవండి: ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment