Recipes In Telugu: How To Make Mango Vada - Sakshi
Sakshi News home page

Mango Vada: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. తయారీ ఇలా!

Published Tue, May 31 2022 6:55 PM | Last Updated on Tue, May 31 2022 7:06 PM

Recipes In Telugu: How To Make Mango Vada - Sakshi

పచ్చిమామిడి తురుము, మినప్పిండితో రుచికరమైన మ్యాంగో వడ ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి.

మ్యాంగో వడ తయారీకి కావలసినవి:  
►పచ్చి మామిడి తురుము – 1 కప్పు
►మినప్పిండి – రెండున్నర కప్పులు
►క్యారెట్‌ తురుము – పావు కప్పు
►శనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు
►పెరుగు – పావు కప్పు
►కారం, గరం మసాలా, చాట్‌ మసాలా – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
►ఉల్లిపాయ ముక్కలు – 1 టీ స్పూన్‌
►పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా
►జీలకర్ర, వాము, నువ్వులు – కొద్దికొద్దిగా
►ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి పరిపడా

తయారీ:
ముందుగా ఒక పాత్రలో..
► మినప్పిండి, పచ్చి మామిడి తురుము, క్యారెట్‌ తురుము
►పెరుగు, కారం, గరం మసాలా, చాట్‌ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి
►తర్వాత తగినంత ఉప్పు కలుపుకుని.. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి.
►ఆ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వడల్లా వేసుకుని వేయించాలి.
►వాటిని సాస్‌లో లేదా చట్నీతో తినొచ్చు లేదా పెరుగులో నాబెట్టుకుని ఆవడల్లా తిన్నా బాగుంటాయి.

ఇది కూడా ట్రై చేయండి: Kachalu Chamadumpa Chaat In Telugu: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్‌ తయారీ ఇలా!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement