
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ.
రిటైల్ మార్కెట్‌లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్‌మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్‌సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్‌తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు.
దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు.
(చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)
Comments
Please login to add a commentAdd a comment