'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..! | Sakshi
Sakshi News home page

Modi Mango: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!

Published Mon, Apr 15 2024 4:32 PM

Modi Mango: It Is Big Size And Taste Sweeter Than Existing Variants - Sakshi

సమ్మర్‌ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్‌లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్‌స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..!

మామిడి పండు జ్యూస్‌ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్‌, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్‌షేక్‌లు, జామ్‌లు, ఊరగాయలు, ఐస్‌క్రీమ్‌లు,డెజర్ట్‌లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు.

'మ్యాంగో మ్యాన్‌'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్‌కతాలోని 'హుస్న్‌ ఎ ఆరా' అనే  మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్‌ సాగు చేసి ఓ కొత్త వేరియంట్‌ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్‌పూర్‌కు చెందిన ఆశోక్‌ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్‌కు చెందిన ఉపేంద్ర సింగ్‌ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్‌ మామిడి అని పేరు దక్కించుకుంది.

ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్‌ కల్టివేట్‌ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్‌ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు.

అతడు సాగు చేసిన  ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది.

ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్‌స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్‌ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. 

(చదవండి: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!)

Advertisement
 
Advertisement