మెగా డాటర్‌ ఆవకాయ పచ్చడి.. నోరు ఊరిపోవాల్సిందే | Niharika Konidela Making Mango Pickle | Sakshi
Sakshi News home page

ఆవకాయ పచ్చడి పెట్టిన నిహారిక

Published Mon, May 4 2020 8:43 PM | Last Updated on Tue, May 5 2020 8:53 AM

Niharika Konidela Making Mango Pickle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. కొంత మంది అయితేపుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు కొత్త కొత్త వంటకాలు చేస్తూ కుటుంబ సభ్యులమొత్తానికి వడ్డిస్తున్నారు.
(చదవండి : మరో తమిళ సినిమాకి ఓకే చెప్పిన నిహారిక)

ఇక ‘మెగా’  ఫ్యామిలి మాత్రం ఆవకాయ పచ్చడి పెట్టే పనిలో నిమగ్నమైపోయింది. ఇప్పటికే  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  సతీమణి ఉపాసన ఆవకాయ పచ్చడి చేసే విధానాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను తన ట్వీటర్‌లో పోస్ట్‌ చేయగా, తాజాగా మెగా డాటర్‌ నిహారిక కూడా అలాంటి వీడియోనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంట్లో స్పెషల్‌గా ఆవకాయ పచ్చడి పెడుతూ.. బిజీ అయిపోయింది. మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిహారిక చేసిన ఆవకాయ పచ్చడి మెగా ఫ్యాన్స్‌ నోళ్లలో నీళ్లురూరించేలా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement