ఫల రాజం మామిడి పండును ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారేమో. వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు మామిడి పళ్ల కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తుంటారు. అయితే మామిడి పళ్ల రుచి మనకే కాదండోయ్.. జంతువులు కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఏనుగు. అవును అంత పెద్ద ఏనుగు సైతం మామిడి పండు రుచికి ఫిదా అయిపోయింది. అందుకే ఏకంగా చెట్టు నుంచి మామిడి పళ్లను రాల్చి మరి వాటిని ఆస్వాదిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు.
‘ఇది మామిడి సమయం. గజరాజు సైతం ఫల రాజానికి ఫిదా అయ్యాడు. చెట్టు నుంచి పళ్లను రాల్చుకుని మరి ఇలా తన తీపి చిరుతిండిని ఆస్వాదిస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించడమే కాక ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
It’s mango time. How can the giant be denied to have the taste of king of fruits😊
— Susanta Nanda IFS (@susantananda3) May 12, 2020
It shakes gently the tree to enjoy a sweet snack.... pic.twitter.com/yd98WolRnh
Comments
Please login to add a commentAdd a comment