
ప్రకాశం, ఉలవపాడు: చివరి దశ..మూడు ఎకరాల్లో బంగినపల్లె కాయలు టన్ను లక్ష రూపాయల రేటు పలికింది. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో మామిడి కాయల సీజన్ పూర్తయింది. బంగినపల్లె కాయలు పూర్తయిపోయాయి. ప్రస్తుతం కేవలం బెంగళూరు, నీలం కాయలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ సోమవారం బంగినపల్లె కాయలు చివరలో పూసిన పూతకు వచ్చిన కాయలు టన్ను లక్ష రూపాయలకు కోశారు. గత పదేళ్లలో ఇదే బంగినపల్లె కాయలకు అత్యధిక రేటు. ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో మామిడి కాయల రైతులు లాభాల బాట పట్టారు. టన్ను రూ.65 వేల వరకు బంగినపల్లె ఎగుమతులు జరిగాయి. చివరలో టన్ను లక్ష పలకడం విశేషం.