మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ వరకు అంతా మ్యాంగో మయం..! | This Restaurant In Seoul Is Offering A Mango Buffet Goes Viral | Sakshi
Sakshi News home page

మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ వరకు అన్ని మ్యాంగో మయం..!

Published Wed, May 29 2024 10:39 AM | Last Updated on Wed, May 29 2024 12:46 PM

This Restaurant In Seoul Is Offering A Mango Buffet Goes Viral

మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్‌ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్‌. కేక్‌లు దగ్గర నుంచి ఐస్‌క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్‌ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్‌ ఇలా సర్వ్‌ చేస్తోందంటే..

మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్‌ మామిడి  పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్‌లోని లోట్టే  అనే హోటల్‌ ఈ వైరైటీ బఫేట్‌ని కస్టమర్ల్‌కు సర్వ్‌ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్‌ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్‌ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్‌, మ్యాంగో డ్రింక్‌, మ్యాంగో ఫుడ్డింగ్‌, మ్యాంగో డెజర్ట్‌, మ్యాంగో ఐస్‌క్రీం, స్పైసీ రైస్‌ కేక్‌లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వ

వెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్‌ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్‌ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్‌ ప్లేస్‌ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement