Buffet
-
రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీ
బెర్క్‌షైర్ హాత్వే మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరింది. ఆ మార్కును చేరిన మొదటి నాన్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ ఘనత సాధించింది. వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ విలువ బుధవారం యూఎస్ మార్కెట్లో 0.8 శాతం పెరిగి 464.59 డాలర్లకు చేరడంతో ఈ రికార్డు నెలకొంది.ఇప్పటివరకు ఒక ట్రిలియన్ డాలర్ల మార్కు చేరిన కంపెనీలు టెక్ సంస్థలే కావడం విశేషం. అలాంటిది నాన్ టెక్ సర్వీసులు అందిస్తున్న కంపెనీ ఈ మార్కు చేరడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వార్తలు మార్కెట్లో వైరల్‌గా మారాయి. ఆల్ఫాబెట్ ఇంక్, మెటా, యాపిల్, ఎన్విడియా కార్ప్ వంటి టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే ఈ మార్కును చేరాయి.చెక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ స్టీవ్ చెక్ మాట్లాడుతూ..‘బెర్క్‌షైర్ సుమారు రెండు బిలియన్ డాలర్ల(రూ.16.7 వేలకోట్లు) విలువైన ఆస్తులను కలిగి ఉంది. ఈ సంవత్సరం సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ కంటే అధికంగా లాభాలు అందించింది. దాదాపు పదేళ్ల నుంచి కంపెనీ ప్రాఫిట్‌లోనే ఉంది. 2024లో సంస్థ తన మదుపరులకు 30 శాతం లాభాలు తీసుకొచ్చింది. దాంతో మార్కెట్ బెంచ్‌మార్క్ 18% పెరిగింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..వారెన్‌బఫెట్ మొదట బెర్క్‌షైర్ హాత్వేను వస్త్ర తయారీ కంపెనీగా స్థాపించారు. క్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా తీర్చిదిద్దారు. బఫెట్ నవంబర్‌లో మరణించిన తన వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్(99)తో కలిసి కంపెనీను ఎంతో అభివృద్ధి చేశారు. బెర్క్‌షైర్ స్థిరంగా 1965 నుంచి ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. -
బాహుబలి బఫెట్
గచ్చిబౌలి: భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యామిలీ ‘బఫెట్’ రెస్టారెంట్ గచ్చిబౌలిలో అందుబాటులోకి వచి్చంది. మాస్టర్ పీస్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే...300 రకాల విభిన్న వంటకాలు అందుబాటులో ఉండడం. 500 మంది కూర్చునే సామర్థ్యంతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రెస్టారెంట్లో భారతీయ వంటకాలతోపాటు పాశ్చాత్య దేశాల రుచులను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ దమ్ బిర్యానీతోపాటు కరేబియన్ ఫుడ్డింగ్, రాజస్థానీ కోఫ్తా కర్రీ, థాయ్ రెడ్కర్రీ, జపనీస్ సకానా కుట్సు, డచ్ చికెన్‌తో పాటు అనేక రకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వెరైటీ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇతర అన్ని రుచులు కలిపి 300 రకాల వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేస్ట్‌కు టేస్ట్.. ఎన్నో వెరైటీలు అందుబాటులోకి రావడంతో ఫుడ్‌లవర్స్ ఖుషీ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మాస్టర్ పీస్ వైపు ఓ లుక్కేయండి మరి. -
మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్‌లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్‌లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్‌క్రీం, స్పైసీ రైస్ కేక్‌లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik) -
Suchitra Divvela: అరటి ఆకు లేకపోతేనేం.. అరెక్కా పళ్లెం ఉందిగా!
పెళ్లంటే... బంధువులు, స్నేహితులతో కలిసి పచ్చటి ఆరిటాకులో పిండివంటలన్నీ చక్కగా వడ్డించుకుని ఆకు పచ్చిదనాన్ని, పచ్చదనాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే ఇప్పుడన్నీ నిలబడి తినే బఫే భోజనాలే. అరటి ఆకు లేకపోతేనేం... అరెక్కా ప్లేట్ ఉంది. సుచిత్ర దివ్వెలది మచిలీపట్నం. చదువు, ఉద్యోగం అన్నీ హైదరాబాద్‌లోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జీతం బాగానే ఉంది. లైఫ్ అంటే నెల చివర బ్యాంకు బాలెన్స్‌లో మిగులు చూసుకుని సంతృప్తి చెందడం కాదనిపించేది. పిల్లలు వేసే అనేక ప్రశ్నల్లోంచి ఆమెకు అనేక సందేహాలు వస్తుండేవి. ఉద్యోగం, మోడరన్లైఫ్ పరుగులో పడి ఏదో కోల్పోతున్నామని కూడా అనిపిస్తుండేది. ఇప్పుడు మనం కాలుష్యరహితంగా జీవించిన గడచిన తరాన్ని చూస్తున్నాం. రేపటి రోజున పిల్లలకు ఎలాంటి జీవితాన్ని మిగులుస్తున్నాం... అని తనను తాను ప్రశ్నించుకునేది. నిజానికి ఇది తన ఒక్క ఇంటి సమస్య కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే రాబోయే తరంలో ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఇంత ఆలోచించిన తర్వాత సుచిత్ర తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కర్ణాటకలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడ విరివిగా లభించే పోకచెట్ల బెరడును ఇలా ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఇక ఆ ప్రయత్నాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టగలిగింది. వెయ్యిలో ఒకరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇకపై ఏ వేడుకలోనూ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు వాడాల్సిన అవసరం ఉండదంటారామె. చెట్టును కొట్టకుండానే..! ‘‘పోక చెట్టు నుంచి సేకరించిన మెటీరియల్‌తో ప్లేట్ అనగానే చెట్టుకు హాని కలిగిస్తారని అపోహ పడడం సహజమే. కానీ పోకచెట్టు కూడా కొబ్బరి చెట్టులాగానే కాయల కోసం గెల వేస్తుంది. పూత దశలోనే గెలను కప్పి ఉంచిన పొర విచ్చుకుంటుంది. కాయలు ముదిరి, గెలను కోసే సమయానికి ఈ పొర కూడా ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా సేకరించిన బెరడు లాంటి పొరను శుభ్రం చేసి, గుండ్రగా కానీ నలుచదరంగా కానీ కత్తిరించి మౌల్డ్‌లో పెట్టి వేడి చేస్తే ప్లేట్ రెడీ అవుతుంది. స్పూన్లు, కప్పులకు కూడా ఇదే పద్ధతి. ఈ చెట్లు కర్ణాటకలో దావణగెరె, చెన్నగిరి, షిమోగా, తుమ్కూరులో ఎక్కువ. ఇక కేరళ, అస్సాంలో కూడా ఉంటాయి. కానీ నాకు పరిచయమైన మిత్రులు కర్ణాటక వాళ్లు కావడంతో నేను అక్కడి నుంచి నా యాక్టివిటీని మొదలుపెట్టాను. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి అవసరాన్నీ చెట్టు తీరుస్తుంది. మనం చెట్టుకు హాని కలిగించకుండా, ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఆదాయం తక్కువే! అరెక్కా ప్లేట్, కప్పుల యూనిట్లు భారీస్థాయిలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో లాభాలు పరిమితంగా ఉంటాయి. నాలాగ ఉద్యోగం చేసుకుంటూ, ప్రవృత్తిగా వీటిని ప్రచారంలోకి తీసుకురావడమే తప్ప, పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టాలంటే కొంచెం ముందువెనుకలు ఆలోచిస్తారు. అందుకే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలనుకునే వాళ్లు తమ వంతు బాధ్యతగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ’’ అన్నారు సుచిత్ర. మనకు వేడుకలు చాలానే ఉంటాయి. శ్రావణ మాసం నోముల నుంచి, గణేశ చతుర్థి, దసరా వేడుకల్లో ప్రసాదాలు పంచుకుంటారు. దేవుడి వేడుకలకు విరాళాలిచ్చే వాళ్లు తమవంతు విరాళంగా ఇలాంటి కప్పులను ఇవ్వడం అలవాటు చేసుకుంటే ‘ప్లాస్టిక్‌ని వాడవద్దు’ అని గొంతెత్తి చాటే పనే ఉండదు. ప్లాస్టిక్ దానంతట అదే కనుమరుగవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బంతి భోజనం వద్దు.. బఫేనే ముద్దు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఉరుకుల పరుగుల యుగంలో జనం ఆహరపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయానికి విలువ పెరగడంతో వేచి ఉండే ధోరణిని మానుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలలో టేబుళ్లు వేసి కూర్చుని తినే ఏర్పాట్లు చేసేవారు. హోటళ్లలోనూ అలాంటి సదుపాయాలే ఉండేవి. కాలక్రమంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూర్చుని తినడానికి బదులు నిల్చుని తినే సంస్కృతి విస్తృతమైంది. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్లు, వేడుకల్లో బఫే (నిల్చుని తినడం) భోజనాలే సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు ఈ బఫే సంస్కృతి ఉన్నత వర్గాల కుటుంబాల్లోనే ఉండేది. కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనూ సర్వసాధారణమైంది. కోవిడ్ నేర్పిన కల్చర్.. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి బఫే కల్చర్‌కు ప్రాధాన్యత పెరిగింది. భౌతిక దూరం పాటించాల్సి రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, నైట్‌ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ జంక్షన్లలో కుర్చీల విధానానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల పంక్తి భోజనాల్లోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ బఫే టిఫిన్లు, భోజనాలకు వీలుగా టేబుళ్లు ఏర్పాటవుతున్నాయి. విజయవాడ నగరంలో ఇలాంటివి అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి. వీటిలో నచ్చిన వాటికి ఆర్డరిచ్చి నిల్చునే తింటున్నారు. గతానికి భిన్నంగా వేచి ఉండే అలవాటుకు స్వస్తి పలుకుతున్నారు. విజయవాడలో ఇలా.. విజయవాడలో కొత్తగా ప్రారంభించే రెస్టారెంట్లలో వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాక రోడ్డు పక్కన, చిన్న చిన్న షాపుల్లోనూ ఏర్పాటు చేస్తున్న టిఫిన్ దుకాణాల బయట ఇలాంటివే ఉంటున్నాయి. కనీసం నాలుగైదు టేబుళ్లు వేస్తున్నారు. నగరంలో ఇలాంటి వాటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. యువతీ యువకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగులు వీటివైపు ఆకర్షితులవుతున్నారు. మారిన ధోరణికిది దర్పణం పడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్ల వారికి ఇలాంటి స్టాండింగ్ టేబుళ్ల ఏర్పాటు వల్ల జాగా బాగా కలిసొస్తోంది. పైగా పెట్టుబడి, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోంది. ఆరోగ్యదాయకం కాకపోయినా.. నిల్చుని తినడం, మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తలెత్తుతాయని, ద్రవాల సమతుల్యత దెబ్బతింటుందని యోగ, ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అదే కూర్చుని తిన్నా, తాగినా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని, నాడీ వ్యవస్థ మెరుగు పడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
బఫెట్ చెప్పిందే నిజమా..!
(సాక్షి, బిజినెస్ విభాగం): ‘‘ఐపీవోలకు దూరంగా ఉండాలి’’ అని విఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన మాటలు... మన దేశ ఐపీవో మార్కెట్లో అక్షర సత్యాలని రుజువవుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఐపీవోలే పెద్ద తార్కాణం. నిన్న ఖాదిమ్ ఇండియా దానికి ముందు న్యూ ఇండియా అష్యూరెన్స్, అంతకు ముందు వచ్చిన జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, సీఎల్ ఎడ్యుకేట్ ఒక్కటేమిటి... పదుల సంఖ్యలో కంపెనీలు ఇటీవల ప్రజల వద్ద ఐపీవో రూట్లో భారీగా నిధులు రాబట్టి, ఆ తర్వాత లిస్టింగ్‌లో ఉసూరుమనిపించాయి. చిన్న ఇన్వెస్టర్లను తలపట్టుకునేలా చేశాయి. ‘‘ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయకూడదు’’ అనేది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు పాటించే కట్టుబాటు. ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయవద్దని వారు రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా సూచిస్తుంటారు. ఇటీవలి మన ఐపీవో మార్కెట్ తీరుతెన్నులను పరికించి చూస్తే వేల్యూ ఇన్వెస్టర్లు ఎందుకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 30 ఐపీవోల్లో సగానికిపైగా ఇష్యూలు ప్రతికూల రాబడులను ఇచ్చినవే. మొత్తం మీద 60 శాతం ఇష్యూల రాబడులు స్టాక్ మార్కెట్ల రాబడుల స్థాయిలో లేకపోవడం నేతిబీర చందాన్ని తలపిస్తోంది. మంచి రాబడులను ఇచ్చిన వాటిలో ఐదు కంపెనీలే ఉన్నాయి. అవి 100 శాతానికిపైగా రిటర్నులిచ్చాయి. వీటిలో డీమార్ట్, సీడీఎస్ఎల్ తదితర కంపెనీలున్నాయి. పైగా బోలెడన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన ఈ ఇష్యూల్లో షేర్లు అలాట్ అయిన కొద్ది మందికే ఆ లాభాలొచ్చాయి. లిస్టింగ్ తరవాత కొనుగోలు చేసినవారికి ఆ స్థాయి లాభాలు లేవు. ‘‘లిస్టింగ్ లాభాలే సామాన్య ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఈ తరహా రాబడుల ఆకర్షణతోనే రిటైల్ ఇన్వెస్టర్లు వచ్చిన ప్రతీ ఐపీవోకు పోటీపడి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీవోలను గమనిస్తే ఇదే తెలుస్తోంది’’ అని విశ్లేషకులు చెబుతున్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారని, దీం తో అధిక ధరల వద్ద ఇరుక్కుపోయి, ఎక్కడో ఒకచోట నష్టానికి అమ్మి బయటపడుతున్నారని వారు వివరించారు. కంపెనీలకు కాదు, పెట్టుబడిదారులకు.. ఈ ఏడాది పలు కంపెనీలు ఐపీఓ మార్గంలో ఇప్పటిరకు రూ.42,000 కోట్లు సమీకరించాయి. ఓ ఏడాదిలో ఈ స్థాయిలో సమీకరణ అన్నది ఐపీవో మార్కెట్లో రికార్డే. వచ్చిన ఇష్యూల్లో దాదాపు 80 శాతం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో నిధులు సమీకరించినవే. ఈ ఏడాదే కాదు!! గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ఇష్యూలను గమనించినా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వచ్చినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ఇష్యూల్లో మూడింట ఒక వంతు వాటిలో ప్రమోటర్లు, పీఈ సంస్థలు ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో తమ వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవటం గమనార్హం. ఆఫర్ ఫర్ సేల్ అంటే... ఐపీవోలో ప్రమోటర్లు, అప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయానికి ఉంచడం. కంపెనీ ఈక్విటీ నుంచి వాటాల జారీ ఉండదు కనుక ఈ విధంగా సేకరించిన నిధులన్నీ ప్రమోటర్లు, పీఈ సంస్థలకే వెళతాయి. ఐపీవో నిధుల్లో కంపెనీల వృద్ధికి కేటాయిస్తున్నవి చాలా పరిమితంగా ఉండటం దురదృష్టకరం. కానీ, గతంలో కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు నిధుల కోసమే ఐపీవోలకు వస్తుండటం సహజంగా జరిగేది. 2006–07 మధ్య ఐపీవోలకు వచ్చిన కంపెనీల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. కాబట్టే అవి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇవ్వగలిగాయి. రెండింటికీ తేడా ఏంటి? కంపెనీలు విస్తరణ చేపట్టాలనుకుని, దానికి నిధుల్లేక ఐపీఓకు వచ్చాయనుకోండి. మనం ఇన్వెస్ట్ చేసిన సొమ్ము నేరుగా కంపెనీకి వెళుతుంది. విస్తరణపై ఆ పెట్టుబడులు పెడతారు కనక కంపెనీతో పాటు దాని విలువ కూడా పెరుగుతుంది. దాంతో ఇన్వెస్టర్ల షేర్ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇపుడు చాలా కంపెనీలు తమ విస్తరణ కోసం పీఈ ఇన్వెస్టర్ల దగ్గరో, ఇతర సంస్థల దగ్గరో పెట్టుబడులు తీసుకుంటున్నాయి. వారు ఏదో ఒక సమయంలో బయటకు వెళ్ళాలనుకున్నపుడు... వారి వాటాలను ఐపీఓలో విక్రయిస్తున్నారు. సహజంగానే ఈ ఐపీఓ ద్వారా వారు తమ పెట్టుబడులకు లాభాలు కావాలనుకుంటారు కనక షేరు విలువను మరీ ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. దీంతో సగటు ఇన్వెస్టరుకు మిగిలేది ఏమీ ఉండటం లేదు. సొమ్ము చేసుకుంటున్నారు... ఇది ఆందోళన కలిగించే ధోరణే. ఐపీవోల్లో నిధుల సమీకరణ అన్నది అధిక శాతం కొత్త ప్రాజెక్టుల కోసం, ప్లాంట్ల ఏర్పాటుకు, విస్తరణ కోసం జరగడం లేదు. కేవలం ప్రైవేటు ఈక్విటీ లేదా వెంచర్ క్యాపిటల్ లేదా ప్రమోటర్ల జేబుల్లోకే వెళుతోంది’’ – ప్రణవ్ హాల్దియా, ప్రైమ్ డేటా బేస్ ఎండీ దూరంగా ఉండండి ‘‘ఐపీఓ మార్కెట్లో బుడగలు పేరుకుపోయాయి. అవి పగిలే వరకు దూరంగా ఉండడం మేలు. తాజా పేలవ లిస్టింగ్‌లతో భవిష్యత్‌లో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చే కంపెనీలు ఇష్యూ ధరలను సరసమైన శ్రేణిలో నిర్ణయిస్తాయి. అవసరమైతే రెండు మూడు నెలల పాటు వేచి చూసి తక్కువ, లేదా సరసమైన విలువలను నిర్ణయించి ఐపీవోకు వస్తాయి’’ – రాకేశ్ జున్‌జున్‌వాలా, ప్రముఖ ఇన్వెస్టర్ వీటికి దూరంగా ఉండటమే మంచిది! నిపుణుల విశ్లేషణ ప్రకారం... ఓ కంపెనీలో అప్పటికే పెట్టుబడులు పెట్టిన ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఆ కంపెనీ గురించి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దీంతో ఆ కంపెనీకి భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా లేకపోయినా లేదా మార్కెట్ సానుకూల పరిస్థితుల వల్ల తమ పెట్టుబడులకు అధిక విలువ లభిస్తుందని భావించినా వారు ఎగ్జిట్ అవడానికి ఐపీవోను ఎంచుకుంటున్నారు. కారణం ఏదైనా ఈ తరహా ఇష్యూలకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండటం మంచిదని విశ్లేషకుల సూచన. అన్నీ ఒక్కటే కాదు... అలాగని ఐపీఓలన్నిటినీ ఒకే గాటన కట్టడానికి లేదు. ఇప్పుడు ఐపీఓకు వచ్చిన చిన్న కంపెనీలు భవిష్యత్తు ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ తరహా కంపెనీలుగా ఎదగటానికి అవకాశాలు లేకపోలేదు. కానీ అలాంటివి అరుదుగా వస్తుంటాయి. నిజానికి ఇలాంటి కంపెనీలు కూడా ఐపీఓలో అధిక ధరలకే షేర్లు జారీ చేసే పోకడ ప్రస్తుతం కనుక ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల షేర్ల ధరలు తక్కువకు అందుబాటులోకి వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి క్యాచ్ చేయాలన్నది నిపుణుల సూచన. -
బఫెట్ అయినా.. బరాక్ భార్య అయినా
డబ్బు సంపాదించడం ఒక ఎత్తు.. సంపదను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. కోట్లు సంపాదించినా.. ఎంతంటే అంత ఖర్చు చేయగలిగే స్తోమత ఉన్నా కొందరు సెలబ్రిటీలు ఏ చిన్నది కొనాలన్నా ఎక్కడ చౌకగా దొరుకుతుందో చూసుకుంటూ ఉంటారు. విలాసాల కోసం భారీ ఖర్చుల జోలికి పోరు. ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ మొదలుకొని.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ దాకా పలువురు ఈ కోవకి చెందిన వారే. పొదుపు విషయాల్లో ఆదర్శంగా నిలిచే.. ఈ సెలబ్రిటీలు పాటించే జాగ్రత్తలేమిటో చూద్దామా.. వారెన్ బఫెట్.. పెట్టుబడులు పెట్టే విషయంలో అందరికీ గురువులాంటి బఫెట్ సంపద దాదాపు 58 బిలియన్ డాలర్ల పైమాటే (సుమారు రూ. 3,48,000 కోట్లు). ఇంత ఆస్తి ఉన్నా ఆయన మాత్రం గత 54 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. 1958లో 31,500 డాలర్లకు కొనుక్కున్న ఈ ఇంటిలో అయిదు బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉంటున్న ప్రాంతంలో ఈ తరహా ఇంటి విలువ అప్పటి రేటుతో పోలిస్తే పన్నెండు రెట్లు ఎక్కువ పలుకుతోందట. అందుకే ఇది తనకు సంబంధించి మూడో ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ అంటారు బఫెట్. (తన మొదటి, రెండో భార్యకు కొనిచ్చిన ఉంగరాలను తొలి రెండు ఉత్తమ పెట్టుబడులు అంటారాయన). మిచెల్లీ ఒబామా.. అవడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి భార్య అయినా, చెప్పుకోతగినంత సంపద ఉన్నా.. మిచెల్లీ భారీ ఖర్చుల జోలికి పోరు. ఒబామా కుటుంబానికి సుమారు 8 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంది. ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా పేరొందినప్పటికీ మిచెల్లీ మాత్రం చాలా ఆచి తూచి ఖర్చు చేస్తారట. కుటుంబానికి కావల్సిన వస్తువులను ఎక్కడ మెరుగ్గా డిస్కౌంట్లు ఇస్తారో చూసుకుని వెళ్లి కొనుక్కుంటుంటారు. ఫ్యాషన్ విషయంలోనూ అంతే. ఖరీదైనవి కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ.. చౌక స్టోర్స్‌లో కూడా షాపింగ్ చేస్తుంటారామె. క్రితంసారి 35 డాలర్లు పెట్టి (రూ.2,100) కూడా డ్రెస్ కొనుక్కున్నారట. హిల్లరీ స్వాంక్.. రెండు సార్లు ఆస్కార్ అవార్డులను అందు కున్న హాలీవుడ్ నటి హిల్లరీ స్వాంక్. ఆమె సంపద దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుంది. నటిగా నిలదొక్కుకునే క్రమంలో.. నివసించడానికి ఇల్లు కూడా లేకపోవడంతో కారునే ఇల్లుగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దశ తిరిగి కోట్లు వచ్చినా.. డబ్బు లేనప్పుడు తాను పడిన కష్టాలను మర్చిపోలేదు హిల్లరీ. అందుకే విలాసాల జోలికి పోదు. టూత్‌పేస్టు నుంచి టాయిలెట్ పేపర్ దాకా ఎక్కడ చౌకగా వస్తాయో చూసుకుని హోల్‌సేల్‌గా కొంటుంది. డిస్కౌంటు కూపన్లలాంటివి దాచిపెట్టి షాపింగ్‌కి వెళ్లినప్పుడు సద్వినియోగం చేసుకుంటుంది. స్నోరెటోరియా.. కోటీశ్వరుల్లో పైసా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే వారితో పాటు.. అనవసరమైన వాటిపై కోట్లు ఖర్చు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారిలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ కూడా ఉన్నాడు. ఒక రేంజిలో గురక పెట్టే క్రూయిజ్ లాంటి వారు .. లేటెస్టుగా స్నోరెటోరియంలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. వినడానికి ప్లానెటోరియంలాగా ఉన్నా.. ఇది ఆ కోవకి చెందినది కాదు. హాయిగా గురక పెట్టి పడుకోవాలనుకునే వారికి ఉపయోగపడే బెడ్రూమ్ లాంటిది ఇది. ఈ గదిలో ఉన్న వారు ఎంత గురక పెట్టినా శబ్దం బైటికి రాకుండా సౌండ్ ప్రూఫ్ చేసి ఉంచుతారట. తన 2 కోట్ల పౌండ్ల పైగా ఖరీదైన ఇంటిలో ఇలాంటి స్నోరెటోరియాన్ని కట్టుకున్నాడు క్రూయిజ్. గతంలో కొందరు హాలీవుడ్ స్టార్స్.. అణుబాంబు దాడులు జరిగిపోతాయేమోనన్న భయంతో.. ఇలాగే ఇళ్లల్లో న్యూక్లియర్ షెల్టర్లు కూడా కట్టుకున్నారు.