బెర్క్‌షైర్ హాత్‌వే మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరింది. ఆ మార్కును చేరిన మొదటి నాన్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ ఘనత సాధించింది. వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ షేర్ విలువ బుధవారం యూఎస్ మార్కెట్‌లో 0.8 శాతం పెరిగి 464.59 డాలర్లకు చేరడంతో ఈ రికార్డు నెలకొంది.
ఇప్పటివరకు ఒక ట్రిలియన్ డాలర్ల మార్కు చేరిన కంపెనీలు టెక్ సంస్థలే కావడం విశేషం. అలాంటిది నాన్ టెక్ సర్వీసులు అందిస్తున్న కంపెనీ ఈ మార్కు చేరడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వార్తలు మార్కెట్‌లో వైరల్‌గా మారాయి. ఆల్ఫాబెట్ ఇంక్, మెటా, యాపిల్, ఎన్విడియా కార్ప్ వంటి టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే ఈ మార్కును చేరాయి.
చెక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ స్టీవ్ చెక్ మాట్లాడుతూ..‘బెర్క్‌షైర్ సుమారు రెండు బిలియన్ డాలర్ల(రూ.16.7 వేలకోట్లు) విలువైన ఆస్తులను కలిగి ఉంది. ఈ సంవత్సరం సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ కంటే అధికంగా లాభాలు అందించింది. దాదాపు పదేళ్ల నుంచి కంపెనీ ప్రాఫిట్‌లోనే ఉంది. 2024లో సంస్థ తన మదుపరులకు 30 శాతం లాభాలు తీసుకొచ్చింది. దాంతో మార్కెట్ బెంచ్‌మార్క్ 18% పెరిగింది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..
వారెన్‌బఫెట్ మొదట బెర్క్‌షైర్ హాత్‌వేను వస్త్ర తయారీ కంపెనీగా స్థాపించారు. క్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా తీర్చిదిద్దారు. బఫెట్ నవంబర్‌లో మరణించిన తన వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్(99)తో కలిసి కంపెనీను ఎంతో అభివృద్ధి చేశారు. బెర్క్‌షైర్ స్థిరంగా 1965 నుంచి ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment