Warren Buffet
-
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్‌మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీ
బెర్క్‌షైర్ హాత్వే మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరింది. ఆ మార్కును చేరిన మొదటి నాన్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ ఘనత సాధించింది. వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ విలువ బుధవారం యూఎస్ మార్కెట్లో 0.8 శాతం పెరిగి 464.59 డాలర్లకు చేరడంతో ఈ రికార్డు నెలకొంది.ఇప్పటివరకు ఒక ట్రిలియన్ డాలర్ల మార్కు చేరిన కంపెనీలు టెక్ సంస్థలే కావడం విశేషం. అలాంటిది నాన్ టెక్ సర్వీసులు అందిస్తున్న కంపెనీ ఈ మార్కు చేరడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వార్తలు మార్కెట్లో వైరల్‌గా మారాయి. ఆల్ఫాబెట్ ఇంక్, మెటా, యాపిల్, ఎన్విడియా కార్ప్ వంటి టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే ఈ మార్కును చేరాయి.చెక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ స్టీవ్ చెక్ మాట్లాడుతూ..‘బెర్క్‌షైర్ సుమారు రెండు బిలియన్ డాలర్ల(రూ.16.7 వేలకోట్లు) విలువైన ఆస్తులను కలిగి ఉంది. ఈ సంవత్సరం సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ కంటే అధికంగా లాభాలు అందించింది. దాదాపు పదేళ్ల నుంచి కంపెనీ ప్రాఫిట్‌లోనే ఉంది. 2024లో సంస్థ తన మదుపరులకు 30 శాతం లాభాలు తీసుకొచ్చింది. దాంతో మార్కెట్ బెంచ్‌మార్క్ 18% పెరిగింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..వారెన్‌బఫెట్ మొదట బెర్క్‌షైర్ హాత్వేను వస్త్ర తయారీ కంపెనీగా స్థాపించారు. క్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా తీర్చిదిద్దారు. బఫెట్ నవంబర్‌లో మరణించిన తన వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్(99)తో కలిసి కంపెనీను ఎంతో అభివృద్ధి చేశారు. బెర్క్‌షైర్ స్థిరంగా 1965 నుంచి ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. -
చార్లీ ముంగెర్ మరణం.. రూ.64 లక్షల కోట్ల కంపెనీకి సహకారం
ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే వైస్ ఛైర్మెన్ చార్లీ ముంగెర్(99) కాలిఫోర్నియా ఆసుపత్రిలో మరణించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. వారెన్ బఫెట్‌కు చార్లీ ముంగెర్ చాలా నమ్మకస్థుడు. జనవరి 1924లో జన్మించిన ముంగెర్ మరణవార్తవిని వారెన్ బఫెట్ స్పందించారు. బెర్క్‌షైర్ హాత్వే ఈ స్థాయికి చేరుకోవడానికి చార్లీ సహకారం ఎంతో ఉందన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముంగెర్కు నివాళులర్పించారు. ‘వ్యాపారంతోపాటు ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చార్లీ బాగా పరిశీలిస్తారు. సంస్థను నిర్మించడంలో తన నైపుణ్యాలు ఇతర నాయకులకు ప్రేరణగా ఉండేవి’అని టిమ్ తన ఎక్స్ ఖాతాలో అన్నారు. A titan of business and keen observer of the world around him, Charlie Munger helped build an American institution, and through his wisdom and insights, inspired a generation of leaders. He will be sorely missed. Rest in peace Charlie. pic.twitter.com/vNGDktOAhz — Tim Cook (@tim_cook) November 28, 2023 చార్లీ ముంగెర్ 1924లో ఒమాహాలో పుట్టి పెరిగారు. ముంగెర్, బఫెట్ 1959లో మొదటిసారి కలుసుకున్నారు. 1978లో బెర్క్‌షైర్ హాత్వే వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. బెర్క్‌షైర్ హాత్వేను టెక్స్టైల్ కంపెనీ నుంచి దాదాపు రూ.64 లక్షల కోట్ల విలువైన సంస్థగా మార్చడంలో ముంగెర్ కీలక పాత్ర పోషించారు. అతని ‘నో నాన్సెన్స్’ విధానంతో కోసం అమెరికన్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందారు. నాణ్యమైన కంపెనీలు గుర్తించి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో చార్లీ ముంగెర్ దిట్ట. ఆ కంపెనీల ఉత్పాదకత ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టి లాభం సంపాదించేవారు. ఆయన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ను ‘ర్యాట్ పాయిజన్’గా పిలిచేవారు. -
వామ్మో రూ.4 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే..
దేశీయ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.లక్ష వద్ద ట్రేడ్ అయిందని తెలిసి ముక్కున వేలేసుకున్నాం. ఇదే భారత్‌లో ఖరీదైన షేర్ అని భావిస్తుండగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ గురించి తెలిసింది. వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే క్లాస్ A షేర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కటి 5,00,000 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 కోట్లకుపైనే. జూన్ 13న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ షేరు 513,655.58 డాలర్ల వద్ద ముగిసింది. ఐదేళ్లుగా షేరును కలిగి ఉన్న ఇన్వెస్టర్లు దాని విలువలో 80 శాతం మేర పెరుగుదలను చూశారు. అధిక ధర కారణంగా కొంత మంది ఇన్వెస్టర్లు స్టాక్ కొనుగోలు చేసేందుకు ముందుకురానప్పటికీ కేవలం త్వరగా లాభాలు ఆర్జించడం కంటే ఓపికగా, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని బెర్క్‌షైర్ హతావే సీఈవో వారెన్ బఫ్ఫెట్ చెబుతున్నారు. అలాంటివారే తనకు కావాల్సిందని ఆయన పేర్కొన్నారు. అస్థిరత ఎక్కువగా ఉండే తక్కువ ధరల స్టాక్‌లలో ప్రోత్సాహకం ఉండదని బఫెట్ తెలిపారు. ఇన్వెస్టర్లకు మరింత అంతర్గత విలువను సృష్టించే స్టాక్‌కు ఆయన ప్రాధాన్యతనిస్తారు. బఫెట్ 1996లో 517,500 క్లాస్ B షేర్లను పరిచయం చేశారు. ఆ స్టాక్ ధర సుమారు 30,000 డాలర్లు. క్లాస్ A బెర్క్‌షైర్ షేర్ల మాదిరిగా కాకుండా క్లాస్ B షేర్ల విషయంలో స్టాక్ స్ప్లిట్ జరగవచ్చు. 2010 జనవరి 21న ఒక స్టాక్ స్ప్లిట్ 50:1 నిష్పత్తిలో జరిగింది. బెర్క్‌షైర్ హతావే మార్కెట్ క్యాపిటలైజేషన్ 737.34 బిలియన్ డాలర్లు. క్లాస్ A షేర్ల ద్వారా 15 శాతం, క్లాస్ B షేర్ల ద్వారా 0.01 శాతం కంపెనీని బఫెట్ కలిగి ఉన్నారు. MRF stock today hit the ₹1,00,000 mark. It became the 1st stock in the Indian Market to ever touch the 6 figure mark. The most expensive stock in the world is Berkshire Hathaway at 400,000$ (around 3.2Crore per stock). Long way to go, but hope MRF crosses that mark one day. — Akshat Shrivastava (@Akshat_World) June 13, 2023 -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ఆణుబాంబు తయారీతో సమానం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమని అన్నారు. దీంతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్ బఫెట్ చేరిపోయారు. చాట్‌జీపీటీ టూల్స్ వినియోగం వల్ల మానవ మనుగడుకు ప్రశ్నార్ధకంగా మారుతుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఏఐని నిలిపివేయాలని లేఖలు సైతం రాశారు. తాజాగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా వారెన్ బఫెట్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ నెబ్రాస్కాలోని ఒమాహాలో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో చర్చ సందర్భంగా వారెన్ బఫెట్.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అణు బాంబుతో పోల్చారు. ఈ అంశాన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కొంతకాలం క్రితం ప్రముఖ బిలియనీర్, తన స్నేహితుడు బిల్ గేట్స్ చాట్‌జీపీటీ గురించి చెప్పినప్పుడు..దాని సామార్ధ్యాలకు గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయా. కానీ, సాంకేతికతపై తాను కొంచెం భయపడుతున్నానని చెప్పారు. అన్ని రకాల పనులు ఒక్కరే చేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పుడు మనం మిగిలిన పనుల్ని చేయలేం. కొత్తగా సృష్టించలేం. మనం చేసే పని మంచిదై ఉండొచ్చు. కానీ అందులోనూ కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు సరికొత్త నిర్వచనమే అణుబాంబు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు ప్రయోగం రుజువు చేసిందని గుర్తు చేశారు. మనం ఏం చేసినా.. ఏది కనిపెట్టినా 200 ఏండ్ల తర్వాత ప్రపంచానికి మేలు చేసేలా ఉండాలి. ప్రపంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పిన ఆయన ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచిస్తాయనని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
వారెన్ బఫెట్: అపర కుబేరుడి మంచి మనసుకు నిదర్శనమిది!
ప్రపంచ అపర కుబేరుడు వారెన్ బఫెట్ది మంచి మనసు. ఎన్నోసార్లు తన తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అయితే.. ఆయన మరణిస్తే తన ఆస్తి ఎవరికి చెందాలో నిర్ణయించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బఫెట్ నిర్ణయం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. " మీ దృష్టిలో సక్సెస్ అంటే..వేల కోట్ల ఆస్తి ఉంటే మనం జీవితంలో విజయం సాధించనట్లు కాదు. డబ్బుతో ఏదైనా కొనుచ్చు. కానీ ప్రేమను కొనలేం. అలాంటి ప్రేమ ఎదుటి వారిని నుంచి పొందాలంటే..మనం వాళ్లని ప్రేమించాలి."అంటూ సక్సెస్‌కి విభిన్నమైన నిర్వచనం చెప్పారు వారెన్ బఫెట్. నిర్వచనం చెప్పడమే కాదు.అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. మరణించిన తర్వాత తన ఆస్తిని ప్రపంచవ్యాప్తంగా పిల్లల సేవింగ్స్ బ్యాంకులు తెరిచి.. తద్వారా వాళ్ల అకౌంట్లలో వేసే యోచనలో(అంచనా) ఉన్నట్లు తెలుస్తోంది. బఫెట్ ఆస్తుల వివరాలు! బెర్క్‌షేర్ హత్వే కంపెనీ సీఈవోగా ఉన్న బఫెట్ 2006లో తన స్టాక్‌లో 85 శాతం ఛారిటీకి ఇస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం..ఎక్కువ భాగం గేట్స్ - మిలిండా ఫౌండేషన్ కు కేటాయించారు. బఫెట్ మొత్తం 90 బిలియన్ డాలర్ల బెర్క్ షైర్ వాటాలో 56 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్ కు, 17.4 బిలియన్ డాలర్లు నాలుగు కుటుంబ సభ్యుల ఛారిటీ సంస్థలకు దానం చేయగా.. మిగిలిన 18 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఏం చేస్తారనేది.. ప్రశ్నార్ధకంగా మారింది. పిల్లల అకౌంట్లకి డబ్బులు ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌడేషన్ మాజీ ఉద్యోగి వాల్ స్ట్రీట్ జర్నల్ తో మాట్లాడుతూ..గేట్స్ ఫౌండేషన్ విరాళాలు అందించే దాతలు ఎక్కువ మంది ఉన్నారు. బఫెట్ దానం చేయగా మిగిలిన మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే బఫెట్ తన ఆస్తుల్ని ఎవరికి ఇవ్వాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్‌తో ఓ ప్రతిపాదన ఉంచినట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి బహిర్గతం చేశారు. "ఇందులో తాను(వారెన్ బఫెట్) మరణించిన 10ఏళ్ల లోపు తన బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఖర్చు చేయాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం వరల్డ్ వైడ్‌గా బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం,అకౌంట్లను ఓపెన్ చేసి అందులో పిల్లల పేర్ల మీద డబ్బులు వేయడం." గేట్స్ ఫౌండేషన్ ఏం చెబుతుందంటే ఆగస్ట్ 30తో 92వ ఏట అడుగుపెట్టనున్న వారెన్ బఫెట్..మరణానంతరం తన సంపదను ఎలా పంపిణీ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ వైడ్‌గా ప్రతి బిడ్డకు పంపిణీ చేసే మొత్తం బఫెట్ సమకూరిస్తే.. విశ్వంలో ఉన్న పిల్లలందరూ సామాజిక ఆర్థిక సమస్యల్ని అధిగ మించవచ్చు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని గేట్స్ ఫౌండేషన్ అభిపప్రాయం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. -
వారెన్ బఫెట్‌కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ!
వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంటనూనె దాకా. పోర్ట్‌ల నుంచి వంట గ్యాస్ వరకు ఇలా ప్రతిరంగంలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళ్తున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు.. ప్రతి రంగంలోనూ అదానీకి విజయమే వరిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే..అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.అందుకే తనని అందుకోవాలనే ఆలోచన కూడా ప్రత్యర్ధులకు రానంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ధనవంతుల జాబితాల్లో ఒక్కొక్కరిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఆసియా రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన..తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. గత శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ షేర్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో అదానీ ఆస్థుల విలువ 123.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 121.7 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇన్వెస్ట్ మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. 5వ స్థానాన్ని రెండేళ్ల క్రితం అదానీ ఆస్థుల విలువ 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇంతింతై వటుడింతయై అన్న చందంగా అదానీ షేర్ వ్యాల్యూ దేశీయ స్టాక్ మార్కెట్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. అలా మార్చి 2021 నుంచి మార్చి 2022 నాటికి అదానీ గ్రూప్ స్టాక్స్ 90 బిలియన్ డాలర్లకు చేరింది. అంచనా ప్రకారం..భారత్‌లో అదానీ ఆస్థుల నికర విలువ 123.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. ముఖేష్ అంబానీ నికర ఆస్థుల విలువ 104.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. అదానీని క్రాస్ చేసేందుకు ముఖేష్ అంబానీకి 19 బిలియన్ డాలర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక యూఎస్ మార్కెట్లో వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్ షైర్ హాత్వే షేర్లు శుక్రవారం రోజు 2శాతం పడిపోవడంతో.. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 6వ స్థానానికి దిగజారినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం..ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా అదానీ కంటే నలుగురు మాత్రమే ధనవంతులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు..స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్' లు 269.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్ అంబానీకి భారీ షాక్..! -
స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్
ప్రపంచంలోని అన్ని బంధాల్లో స్నేహ బంధం గొప్పదంటారు. తల్లదండ్రులకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను కేవలం స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహితుల పుట్టిన రోజు వస్తే ఖచ్చితంగా ఎదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే.. ఆ బహుమతి విలువ దాని ఖరీదును బట్టి కాకుండా ఇచ్చే స్వచ్చమైన మనుసును బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన స్నేహితుడికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. అవును తన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఆదివారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ తన స్నేహితుడి కోసం స్వయంగా కేకును తయారు చేసి వారెన్కు బర్త్‌డే విషెస్ తెలిపారు. (‘2021 మే నాటికి కరోనా అంతం’) కేక్ తయారు చేసిన వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిమిషం నిడివిగల ఈ వీడియోకు ‘90వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వారెన్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో కేకు కోసం పిండిని జల్లెడ పట్టం, చాక్లెట్ కట్ చేయడం నుంచి అన్ని పనులను ఆయనే చేశారు. ఆఖరుగా కేకును బేక్ చేసి దానిపై ఓరియో బిస్కెట్లతో అందంగా తయరు చేశాడు. ఒక పీస్‌ను కట్ చేసి పెట్టాడు. అతను చివరకు తుది ఉత్పత్తితో పోజులిచ్చాడు మరియు కేక్ నుండి ఒక ముక్కను కత్తిరించాడు. అయితే కేకుతోపాటు భావోద్వేగ లేఖను కూడా స్నేహితుడి కోసం రాశారు. ఇందులో వారెన్ వ్యక్తిగత జీవితం, స్నేహం బంధం గురించి వివరించారు. కాగా బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ తొలిసారిగా 1991 జూలై 5న కలుసుకున్నారు. (2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు) Happy 90th birthday, Warren! pic.twitter.com/8nH2EulTR4 — Bill Gates (@BillGates) August 30, 2020 -
2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు
కోవిడ్-19 ప్రపంచ దేశాలను.. ప్రధానంగా అమెరికాను సునామీలా చుట్టుమడుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. యూఎస్ ఇండెక్సులలో నాస్డాక్ ఈ ఏడాది(2020) పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంది. ఇందుకు ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్ సహకరించాయి. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజం ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రం వెనకడుగులో ఉంది. ఈ ఏడాది బెర్క్‌షైర్ షేరు 16 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాపిటలైజేషన్లో 90 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ 460 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇదే సమయంలో ఫాంగ్ స్టాక్స్‌గా ప్రసిద్ధమైన అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌తోపాటు ఇటీవల ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. కారణాలేవిటంటే? 2020లో ఇప్పటివరకూ అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్.. విడిగా 560-100 బిలియన్ డాలర్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ను జమ చేసుకున్నాయి. ఇదే కాలంలో బెర్క్‌షైర్ హాథవే 90 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఇందుకు ప్రధానంగా బెర్క్‌షైర్ హాథవే పోర్ట్‌ఫోలియోలోని నాలుగు దిగ్గజ కంపెనీల వెనకడుగు కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికాతోపాటు.. ఇంధన రంగ దిగ్గజం ఎగ్జాన్ మొబిల్కు ప్రాధాన్యత ఉంది. ఈ నాలుగు కంపెనీల షేర్లు సైతం ఇటీవల నీరసించడంతో వీటి మార్కెట్ విలువలోనూ 110-140 బిలియన్ డాలర్ల మధ్య ఆవిరైంది. ఇది బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాప్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషించారు. -
పేటీఎమ్‌లో బఫెట్ పెట్టుబడి!
న్యూఢిల్లీ: ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. భారత డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే.. పేటీఎమ్ను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ సంస్థలో 3–4% వాటాను కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కోసం బెర్క్‌షైర్ సంస్థ 30–35 కోట్ల డాలర్ల(రూ.2,200–2,500 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని వన్97 కమ్యూనికేషన్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నదని ఆ వర్గాలు తెలిపాయి. పేటీఎమ్‌కు నిధుల బలిమి ఈ లెక్కన పేటీఎమ్ కంపెనీ విలువ 1,000 కోట్ల డాలర్లని అంచనా. కాగా ఈ విషయమై బెర్క్‌షైర్ హతావే స్పందించలేదు. పేటీఎమ్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే, బఫెట్‌కు భారత్ టెక్నాలజీ రంగంలో తొలి ఇన్వెస్ట్మెంట్ ఇదే అవుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రైవేట్ రంగంలోని(స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని) టెక్నాలజీ కంపెనీలో బఫెట్‌కు తొలి పెట్టుబడి కూడా ఇదే కానున్నది. గతంలో ఆయన ఐబీఎమ్, యాపిల్ వంటి లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇటీవలనే ఐబీఎమ్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ తేజ్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న పేటీఎమ్‌కు ఈ తాజా పెట్టుబడులు మంచి బలాన్ని ఇస్తాయని నిపుణులంటున్నారు. పేటీఎమ్ సంస్థ, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఈ–కామర్స్ రంగాల్లోకి విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. కాగా గత ఏడాది మేలో పేటీఎమ్‌లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ రూ.9,079 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. పేటీఎమ్... టాప్ త్రీ కన్సూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో ఒకటి 2011లో వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ ఇండియాను ఏర్పాటు చేశారు. బీమా వ్యాపారం కోసం బజాజ్ అలయంజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రెండేళ్ల తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి వైదొలిగారు. భారత్‌లో బీమా రంగానికి సంబంధించి నియమనిబంధనలు కఠినంగా ఉండటమే దీనికి కారణమని అంటారు. కాగా ఇప్పటికే పేటీఎమ్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, చైనా ఆలీబాబా గ్రూప్, యాంట్ ఫైనాన్షియల్, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, మీడియాటెక్‌లు పేటీఎమ్‌లో ఇన్వెస్ట్ చేశాయి. పేటీఎమ్‌లో నెలకు 400 కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌కు 130 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2000 సంవత్సరంలో వన్97ను విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించారు. ఆరంభంలో మొబైల్ చెల్లింపులు, మొబైల్ రీచార్జ్ వ్యాపారం చేసే ఈ కంపెనీ ప్రస్తుతం భారత్‌లో టాప్ త్రీ కన్సూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కాగా, బెర్క్‌షైర్ హతావే కంపెనీ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌లో పెట్టుబడులు పెట్టనున్నదని ఈ ఏడాది మేలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ అవి సాకారం కాలేదు. -
షేర్ల జోరు : బఫెట్‌ను దాటేసిన జుకర్‌బర్గ్
శాన్ఫ్రాన్సిస్కో : ఓ వైపు కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం జంగకుండా శరవేగంగా దూసుకుపోయింది. శుక్రవారం ఫేస్బుక్ స్టాక్స్ ఆల్-టైమ్ రికార్డు గరిష్టంలో 203.23 డాలర్ల వద్ద ముగిశాయి. అతిపెద్ద స్పోర్ట్స్ స్ట్రీమింగ్ డీల్‌ను ఫేస్బుక్ దక్కించుకుంది అని తెలియగానే కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఉరకలు పెట్టారు. ఈ వార్త ఇన్వెస్టర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఆసియాలోని థాయ్‌ల్యాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్‌లో 2019 నుంచి 2022 వరకు జరిగే 380 లైవ్ మ్యాచ్‌ల ఎక్స్‌క్లూజివ్ రైట్స్‌ను ఫేస్బుక్ దక్కించుకుందని టైమ్స్ రిపోర్టు చేసింది. ఈ డీల్ విలువ 264 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఫేస్బుక్ స్టాక్స్ ఆల్‌టైమ్ గరిష్టంలో ర్యాలీ జరుపడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా అదేమాదిరి దూసుకుపోయింది. వారెన్ బఫెట్‌ను దాటేసి, ప్రపంచంలో మూడో అత్యంత ధనికుడిగా నిలిచారు. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత మూడో స్థానంలో జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం జుకవర్‌బర్గ్ సంపద 81.6 బిలియన్ డాలర్లుగా ఉంది. డేటా షేరింగ్ స్కాండల్‌తో మార్చి నెలలో ఫేస్బుక్ షేర్లు ఎనిమిది నెలల కనిష్టంలో 152.22 డాలర్ల వద్ద నమోదైన సంగతి తెలిసింది. శుక్రవారం రోజు ఈ స్టాక్ 203.23 డాలర్ల వద్ద ముగిసింది. -
10 వేలు = 6.3 కోట్లు!!
ఎప్పటికీ మీ దగ్గరే అట్టిపెట్టుకోవాలనుకునే షేర్లనే కొనుగోలు చేయాలని ఇన్వెస్టింగ్ దిగ్గజం వారెన్ బఫెట్ తరచూ చెబుతుంటారు. ఆయన మాటలను తాజాగా ఇన్ఫోసిస్ షేర్ నిజం చేసింది. ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో లిస్టయి గురువారం నాటికి సరిగ్గా పాతికేళ్లు నిండాయి. ఈ 25 ఏళ్లలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిన బ్లూ చిప్ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. కంపెనీ ఇచ్చిన డివిడెండ్లు, బోనస్, షేర్ల విభజన మొత్తం కలుపుకుంటే ఈ పాతికేళ్లలో అనూహ్యమైన భారీ రాబడులనిచ్చింది. 40 శాతానికి పైగా చక్రగతిన వృద్ధి చెందిన స్థాయి లాభాలను పంచింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ.6.34 కోట్లకు పెరిగి ఉండేదనేది గణాంకాలు చెబుతున్న మాట. ఈ ఏడాది మార్చి నాటికి ఇన్ఫోసిస్, ఇతర అనుబంధ కంపెనీల్లో కలిపి మొత్తం 2.04,107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలాంటి రుణ భారం లేని ఈ కంపెనీకి ప్రస్తుతం రూ.19,818 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 24 శాతం ఎగసింది. పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాని ఐపీఓ 1981లో పుణేలో ఒక చిన్న భవంతిలో 250 డాలర్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఇన్ఫోసిస్ ప్రస్థానం ప్రారంభమైంది. 1992లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌గా పేరు మార్చుకుంది. 2011లో ఇన్ఫోసిస్ లిమిటెడ్‌గా మారింది. ఈ కంపెనీ 1993లో రూ.95 ధరతో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చింది. ఈ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాలేదు. 13 శాతం వాటాను మోర్గాన్ స్టాన్లీ కొనుగోలు చేసింది. 1993, జూన్ 14న స్టాక్ మార్కెట్లో రూ.145 ధర వద్ద లిస్టయింది. ఆ తర్వాత ఈ షేర్ పెరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతూనే ఉంది. ఈ పాతికేళ్లలో కంపెనీ మొత్తం 11 సార్లు బోనస్‌లు ఇచ్చింది. దీంట్లో 10 సార్లు ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇచ్చింది. 2004లో మాత్రం ఒక షేర్‌కు మూడు షేర్లను బోనస్‌గా (3:1) ఇచ్చింది. 1999లో రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.5 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది. 1993లో వంద ఇన్ఫోసిస్ షేర్లు ఉంటే (ఐపీఓలో రూ.10,000 పెబ్టుబడి) ఈ బోనస్‌లు, షేర్ల విభజనను కూడా కలుపుకుంటే ప్రస్తుతం షేర్ల సంఖ్య 51,200కు పెరుగుతుంది. గురువారం నాటి ముగింపు ధరను (రూ.1,239) పరిగణనలోకి తీసుకుంటే ఈ షేర్ల విలువ రూ.6.34 కోట్లుగా ఉంటుంది. ఇక 2,000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లిస్తూనే ఉంది. ఆ డివిడెండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వాటాదారులకు మరింత విలువ సమకూరినట్లే. ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ... 1999లో ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఈసాప్స్‌ను (ఎంప్లాయి స్టాక్ ఆప్షన్స్) ఇచ్చింది. వీటితోనే ఎందరో ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. అదే ఏడాది ఏడీఆర్‌లను (అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్) కూడా జారీ చేసింది. ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ కూడా ఇదే. భవిష్యత్తులో కూడా ఇన్ఫోసిస్ మంచి లాభాలనే ఇస్తుందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. భారీగా వృద్ధికి అవకాశాలున్న డిజిటల్ రంగంలో ఈ కంపెనీ పెట్టుబడుల జోరును పెంచుతోందని, మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని వారంటున్నారు. ఏడాది కాలంలో ఈ షేర్ రూ.1,420కు చేరగలదన్న అంచనాలతో షేర్‌ఖాన్ బ్రోకరేజ్ ఈ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. -
భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు!
► ఇన్వెస్ట్మెంట్ గురు.. వారెన్ బఫెట్ వ్యాఖ్యలు ► అపార అవకాశాలున్న మార్కెట్... ► అవకాశం లభిస్తే పెట్టుబడులకు రెడీ.. న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో లెజండరీగా పేర్కొనే వారెన్ బఫెట్ భారత్‌ను అపార అవకాశాలున్న మార్కెట్‌గా అభివర్ణించారు. అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు చక్కని అవకాశం కనిపిస్తే వెంటనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘‘భారత్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ అద్భుతమైన కంపెనీ ఉంటే చెప్పండి. రేపటికల్లా అక్కడే ఉంటాను’’ అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో అన్నారు. మార్కెట్ పట్ల కాకుండా కంపెనీ వ్యాపారాలపై దృష్టి పెట్టాలంటూ ఇన్వెస్టర్లకు ఓ సక్సెస్ మంత్రాన్ని బోధించారు. భవిష్యత్తు అద్భుతం: ‘‘భారత్‌లో భవిష్యత్ తరం అంతా ఇప్పటి కంటే మరింత గొప్పగా జీవించగలుగుతారు. మేథో సామర్థ్యాల దృష్ట్యా భారత్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది’’ అని బఫెట్ చెప్పారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణుల గురించి ఆయన మాట్లాడారు. భారత్‌లోని ఐఐటీ ఇంజనీర్లను మాత్రమే తాను నియమించుకుంటానంటూ లోగడ మైక్రోసాఫ్ట్ యజమాని బిల్ గేట్స్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ‘‘ఎవరైనా సరే విస్మరించడానికి వీల్లేని భారీ అవకాశాలున్న బ్రహ్మాండమైన మార్కెట్ భారత్ అని చెప్పారు. వృద్ధికి ఢోకా లేదు: ‘‘భారత వృద్ధికి ఢోకా లేదు. తలసరి ఆదాయం వేగంగా పెరిగే విషయంలోనూ సందేహం లేదు’’ అని కూడా బఫెట్ స్పష్టం చేశారు. మన దేశంలో తలసరి ఆదాయం 2015–16లో రూ.1.06 లక్షల కోట్లు ఉండగా 2031–32 నాటికి రూ.3.14 లక్షల కోట్లకు పెరుగుతుందన్న నివేదికలున్న విషయం తెలిసిందే. గూగుల్ బస్ మిస్ బఫెట్ గతంలో పెట్టుబడులకు సంబంధించి తాను చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందారు. ఐబీఎంకు బదులు గూగుల్ లేదా అమేజాన్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందంటూ బెర్క్‌షైర్ హ్యాత్వే 53వ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. బెర్క్‌షైర్ బీమా విభాగం.. ‘గీకో’ ప్రకటనల ప్రదర్శనకు గూగుల్ ఒక్కో క్లిక్కు 10, 11 డాలర్ల చార్జీ వసూలు చేసినప్పుడే అందులో పెట్టుబడులు పెడితే బాగుం డేదన్నారు. టెక్నాలజీ స్టాక్స్‌ను విస్మరించడంపైనా విచారం వ్యక్తం చేశారు. వాటి విలువను మొదట్లోనే గుర్తించలేకపోయినట్టు చెప్పారు. అజిత్ జైన్ బెర్క్‌షైర్ కి తన కంటే ఎక్కువే ఆదాయాన్ని తెచ్చి పెట్టారని.. ఆయన కంపెనీని వీడినా, రిటైర్ అయినా అతని స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని చెప్పారు. -
బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు..
ఒమాహా: అపర కుబేరుడు, బెర్క్‌షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్‌తో కలసి భోంచేసేందుకు ఓ వ్యక్తి రూ.22,76,80,830 (3,456,789 డాలర్లు) చెల్లించనున్నాడు. స్వచ్ఛంద సంస్థ గ్లైడ్ ఫౌండేషన్‌కు నిధులను సమకూర్చేందుకు ప్రతి ఏడాదిలానే ‘ఈ-బే’లో బఫెట్ వేసిన వేలంలో ఆ మొత్తానికి పాడుకున్నాడు. విజేత తన పేరు వెల్లడించలేదు. ఆ వ్యక్తి న్యూయార్క్‌లోని స్మిత్ అండ్ వాలెన్‌స్కై స్టీక్ హౌజ్‌లో బఫెట్‌తో భోజనం చేస్తారు. ఈ స్టీక్ హౌజ్ కూడా 10 వేల డాలర్లను గ్లైడ్కు దానం చేస్తోంది. గ్లైడ్ ఫౌండేషన్‌లో బఫెట్ తొలి భార్య సుజీ వలంటీర్‌గా పనిచేసేవారు. ఆమె 2004లో చనిపోయారు. -
శత్రువులుగా కాకుండా స్నేహితులుగానే భావించండి!
స్కాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఇన్వెస్టర్లు శత్రువులుగా భావించకుండా స్నేహితులుగానే పరిగణించాలని అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ సలహా ఇచ్చారు. నష్టభయాలను నుంచి ఇన్వెస్టర్లు తప్పించుకోవడానికి VIX ఫ్యూచర్స్(వాలటిలిటీ ఇండెక్స్) అనే కొత్త సూచీని ఫిబ్రవరి 26 తేదిన నేషనల్ స్టాక్ ఎక్సెంజీ (ఎన్ఎస్ఈ) ప్రారంభించనుంది. మార్కెట్ ఒడిదుడుకులను స్పెక్యులేటర్స్ సానుకూలంగా మార్చుకునేందుకు, ఈక్వీటి ఫోర్ట్ ఫోలియోలో మదుపుదారులు నష్టభయాల్ని తగ్గించుకునేందుకు VIX ఫ్యూచర్స్ ను ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు సూచించారు. వాలటిలిటీ ఇండెక్స్ ను అంతర్జాతీయ మార్కెట్ లో ఫియర్ ఇండెక్స్ గా పిలుస్తారు. ఫియర్ ఇండెక్స్ ను 1993లో తొలిసారి షికాగో బోర్డు ఆప్షన్స్ ఎక్చ్సెంజ్ (సీబీఓఈ) ప్రారంభించింది. 30 రోజుల సగటు వాలటిలిటి అంచనాలను VIX వెల్లడిస్తుంది. ఇక్విటీ సూచీలనైన ఎస్ ఆండ్ పీ 500, నిఫ్టీ లలో తీవ్ర ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని భావిస్తే VIX ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ల తీసుకోవడానికి ట్రేడింగ్ వ్యూహాంపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
రోజుకు... 37 మిలియన్ డాలర్లు
న్యూయార్క్: అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ సంపద ఈ ఏడాదిలో రోజుకు 37 మిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది. తద్వారా 2013లో అత్యధికంగా సంపాదించిన బిలియనీర్‌గా బఫెట్ ని ల్చారు. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం 2013లో బఫెట్ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 46.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, సంపద పెరుగుదలలో బఫెట్ టాప్‌లో ఉన్నా.. మొత్తం సంపద విషయంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్సే నంబర్‌వన్‌గా ఉన్నారు. వెల్త్-ఎక్స్ టాప్ 10 కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ 72.6 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో నిల్చారు. ఆయన సంపద 11.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం టాప్ 10 సంపన్నుల సంపద 2013లో 101.8 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. డిసెంబర్ నాటికి వీరందరి ఆస్తి విలువ కలిపితే 347 బిలియన్ డాలర్లు. ఎస్అండ్పీ 500 సూచీని మించి (24%) వీరి సంపద 41.6% మేర పెరిగింది. సంపద పెరుగుదలను బట్టి చూస్తే కెసినో దిగ్గజం షెల్డన్ అడెల్సన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్ బర్గ్ వరుసగా 3 నుంచి 5వ స్థానం దాకా ఆక్రమించారు.