బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు..
ఒమాహా: అపర కుబేరుడు, బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్‌తో కలసి భోంచేసేందుకు ఓ వ్యక్తి రూ.22,76,80,830 (3,456,789 డాలర్లు) చెల్లించనున్నాడు. స్వచ్ఛంద సంస్థ గ్లైడ్ ఫౌండేషన్‌కు నిధులను సమకూర్చేందుకు ప్రతి ఏడాదిలానే ‘ఈ-బే’లో బఫెట్ వేసిన వేలంలో ఆ మొత్తానికి పాడుకున్నాడు. విజేత తన పేరు వెల్లడించలేదు.
ఆ వ్యక్తి న్యూయార్క్‌లోని స్మిత్ అండ్ వాలెన్‌స్కై స్టీక్ హౌజ్‌లో బఫెట్‌తో భోజనం చేస్తారు. ఈ స్టీక్ హౌజ్ కూడా 10 వేల డాలర్లను గ్లైడ్‌కు దానం చేస్తోంది. గ్లైడ్ ఫౌండేషన్‌లో బఫెట్ తొలి భార్య సుజీ వలంటీర్‌గా పనిచేసేవారు. ఆమె 2004లో చనిపోయారు.