దేశీయ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ షేర్ విలువ రూ.లక్ష వద్ద ట్రేడ్ అయిందని తెలిసి ముక్కున వేలేసుకున్నాం. ఇదే భారత్‌లో ఖరీదైన షేర్ అని భావిస్తుండగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ గురించి తెలిసింది.
వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే క్లాస్ A షేర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కటి 5,00,000 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 కోట్లకుపైనే. జూన్ 13న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ షేరు 513,655.58 డాలర్ల వద్ద ముగిసింది. ఐదేళ్లుగా షేరును కలిగి ఉన్న ఇన్వెస్టర్లు దాని విలువలో 80 శాతం మేర పెరుగుదలను చూశారు.
అధిక ధర కారణంగా కొంత మంది ఇన్వెస్టర్లు స్టాక్ కొనుగోలు చేసేందుకు ముందుకురానప్పటికీ కేవలం త్వరగా లాభాలు ఆర్జించడం కంటే ఓపికగా, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని బెర్క్‌షైర్ హతావే సీఈవో వారెన్ బఫ్ఫెట్ చెబుతున్నారు. అలాంటివారే తనకు కావాల్సిందని ఆయన పేర్కొన్నారు. అస్థిరత ఎక్కువగా ఉండే తక్కువ ధరల స్టాక్‌లలో ప్రోత్సాహకం ఉండదని బఫెట్ తెలిపారు. ఇన్వెస్టర్లకు మరింత అంతర్గత విలువను సృష్టించే స్టాక్‌కు ఆయన ప్రాధాన్యతనిస్తారు.
బఫెట్ 1996లో 517,500 క్లాస్ B షేర్లను పరిచయం చేశారు. ఆ స్టాక్ ధర సుమారు 30,000 డాలర్లు. క్లాస్ A బెర్క్‌షైర్ షేర్ల మాదిరిగా కాకుండా క్లాస్ B షేర్ల విషయంలో స్టాక్ స్ప్లిట్ జరగవచ్చు. 2010 జనవరి 21న ఒక స్టాక్ స్ప్లిట్ 50:1 నిష్పత్తిలో జరిగింది. బెర్క్‌షైర్ హతావే మార్కెట్ క్యాపిటలైజేషన్ 737.34 బిలియన్ డాలర్లు. క్లాస్ A షేర్ల ద్వారా 15 శాతం, క్లాస్ B షేర్ల ద్వారా 0.01 శాతం కంపెనీని బఫెట్ కలిగి ఉన్నారు.
MRF stock today hit the ₹1,00,000 mark. It became the 1st stock in the Indian Market to ever touch the 6 figure mark.
— Akshat Shrivastava (@Akshat_World) June 13, 2023
The most expensive stock in the world is Berkshire Hathaway at 400,000$ (around 3.2Crore per stock).
Long way to go, but hope MRF crosses that mark one day.
Comments
Please login to add a commentAdd a comment