రోజుకు... 37 మిలియన్ డాలర్లు | warren buffet biggest gainer in 2013 with 37 million dollars per day earning | Sakshi
Sakshi News home page

రోజుకు... 37 మిలియన్ డాలర్లు

Published Thu, Dec 19 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

రోజుకు... 37 మిలియన్ డాలర్లు

రోజుకు... 37 మిలియన్ డాలర్లు

న్యూయార్క్: అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ సంపద ఈ ఏడాదిలో రోజుకు 37 మిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది. తద్వారా 2013లో అత్యధికంగా సంపాదించిన బిలియనీర్‌గా బఫెట్ ని ల్చారు. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం 2013లో బఫెట్ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 46.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, సంపద పెరుగుదలలో బఫెట్  టాప్‌లో ఉన్నా.. మొత్తం సంపద విషయంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్సే నంబర్‌వన్‌గా ఉన్నారు. వెల్త్-ఎక్స్ టాప్ 10 కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ 72.6 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో నిల్చారు. ఆయన సంపద 11.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
 
 వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం టాప్ 10 సంపన్నుల సంపద 2013లో 101.8 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. డిసెంబర్ నాటికి వీరందరి ఆస్తి విలువ కలిపితే 347 బిలియన్ డాలర్లు. ఎస్‌అండ్‌పీ 500 సూచీని మించి (24%) వీరి సంపద 41.6% మేర పెరిగింది. సంపద పెరుగుదలను బట్టి చూస్తే కెసినో దిగ్గజం షెల్డన్ అడెల్‌సన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్ బర్గ్ వరుసగా 3 నుంచి 5వ స్థానం దాకా ఆక్రమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement