Wealth-X
-
కుబేరుల గని.. ముంబై వర్సిటీ
* పూర్వ విద్యార్థుల్లో 12 మంది బిలియనీర్లు * టాప్ 10 వర్సిటీల్లో 9వ స్థానం న్యూఢిల్లీ: అత్యధిక సంఖ్యలో సంపన్నులను సృష్టించిన టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ముంబై వర్సిటీ నుంచి బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్న వారిలో ఏకంగా 12 మంది బిలియనీర్లుగా ఉన్నారు. దీంతో కోట్లకు పడగలెత్తిన పూర్వ విద్యార్థులు .. అత్యధిక సంఖ్యలో ఉన్న వర్సిటీల్లో ఒకటిగా ముంబై విశ్వవిద్యాలయం నిల్చింది. అమెరికా వర్సిటీలను మినహాయిస్తే ఇంత ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లను అందించిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే. వెల్త్-ఎక్స్, యూబీఎస్ ఈ ఏడాది నిర్వహించిన బిలియనీర్ సెన్సస్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 25 మంది బిలియనీర్ పూర్వ విద్యార్థులతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (16 మంది), ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం (14 మంది) వరుసగా టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. ముంబై విశ్వవిద్యాలయంలో చదివిన బిలియనీర్ల సంఖ్య.. అటు ఎంఐటీ, ఎన్‌వైయూ, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డ్యూక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రఖ్యాత వర్సిటీల కన్నా అధికం కావడం గమనార్హం. టాప్ 20 బిలియనీర్ స్కూల్స్‌లో 16 అమెరికాలోనే ఉన్నాయి. మిగతా నాలుగింటిలో.. ముంబై విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (బ్రిటన్), లొమొనొసొవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ(రష్యా), ఈటీహెచ్ జ్యూరిక్(స్విట్జర్లాండ్) ఉన్నాయి. -
కుబేరుల ఖిల్లా... భారత్!
సింగపూర్/న్యూఢిల్లీ: అధిక బిలియనీర్లు ఉన్న ఆరో దేశంగా భారత్ ఈ ఏడాదీ తన స్థానాన్ని నిలుపుకుంది. అయితే 2013తో పోల్చితే బిలియనీర్ల సంఖ్య 103 నుంచి 100కు తగ్గింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సస్ 2014 ఈ వివరాలను వెల్లడించింది. ముఖ్యాంశాలు... ఈ ఏడాది భారత్‌లో కుబేరుల సంఖ్య 100కు తగ్గింది. ఈ వంద మంది సంపద కూడా 17, 500 కోట్ల డాలర్లకు చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య రికార్డ్ స్థాయికి, 2,325కు చేరింది. స్విట్జర్లాండ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్ తదితర దేశాల కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికం.28 మంది బిలియనీర్లతో ముంబై ప్రపంచంలోనే అగ్రశ్రేణి 20 బిలియనీర్ సిటీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ షయంలో 103 మంది బిలియనీర్లతో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. ఇక అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. 571 మంది బిలియనీర్లతో అమెరికా ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(190 మంది బిలియనీర్లు), యునై టెడ్ కింగ్డం(130)లు నిలిచాయి. -
రోజుకు... 37 మిలియన్ డాలర్లు
న్యూయార్క్: అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ సంపద ఈ ఏడాదిలో రోజుకు 37 మిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది. తద్వారా 2013లో అత్యధికంగా సంపాదించిన బిలియనీర్‌గా బఫెట్ ని ల్చారు. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం 2013లో బఫెట్ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 46.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, సంపద పెరుగుదలలో బఫెట్ టాప్‌లో ఉన్నా.. మొత్తం సంపద విషయంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్సే నంబర్‌వన్‌గా ఉన్నారు. వెల్త్-ఎక్స్ టాప్ 10 కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ 72.6 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో నిల్చారు. ఆయన సంపద 11.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం టాప్ 10 సంపన్నుల సంపద 2013లో 101.8 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. డిసెంబర్ నాటికి వీరందరి ఆస్తి విలువ కలిపితే 347 బిలియన్ డాలర్లు. ఎస్అండ్పీ 500 సూచీని మించి (24%) వీరి సంపద 41.6% మేర పెరిగింది. సంపద పెరుగుదలను బట్టి చూస్తే కెసినో దిగ్గజం షెల్డన్ అడెల్సన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్ బర్గ్ వరుసగా 3 నుంచి 5వ స్థానం దాకా ఆక్రమించారు. -
ఆసియాలో కుబేరుల జోరు..
న్యూఢిల్లీ: ఆర్థిక అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ, ఆసియా ప్రాంతంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని వెల్త్-ఎక్స్ మ్యాగజైన్, యూబీఎస్ల బిలియనీర్ సెన్సస్ 2013 తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆసియా ప్రాంతంలో 18 మంది కొత్తగా బిలియనీర్లయ్యారని , ఇదొక రికార్డని ఈ నివేదిక పేర్కొంది. 3 కోట్ల డాలర్లకు పైగా సంపద ఉన్న వారిని ఈ నివేదిక బిలియనీర్లుగా వ్యవహరించింది. ఆసియాలో బిలియనీర్ల జోరు ఇలానే కొనసాగితే, ఐదేళ్లలో బిలియనీర్ల విషయంలో ఈ ప్రాంతం దక్షిణ అమెరికా సరసన చేరుతుంది. మొత్తం మీద ఆసియాలో 44,505 మంది కొత్త ఆల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులున్నారు. వీరందని సంపద 6,590 కోట్ల డాలర్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఏడాదికి అంతర్జాతీయంగా బిలియనీర్ల సంఖ్య 2,170కు చేరింది.