Viral: వామ్మో.. పది అడుగుల పామును ఇట్టే పట్టేసింది! | Woman Catches Snake With Bare Hands In Vietnam | Sakshi
Sakshi News home page

వైరల్‌: అమ్మో ఏమి సాహసం..చూస్తే మతి పోవాల్సిందే!

Published Thu, Jun 3 2021 11:11 AM | Last Updated on Thu, Jun 3 2021 12:30 PM

Woman Catches Snake With Bare Hands In Vietnam - Sakshi

హనోయి(వియత్నాం): మామూలుగా పాము కనిపిస్తే ఏం చేస్తాం? దూరంగా పరిగెడుతాం..సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వియత్నాం లేడీ మాత్రం 10 అడుగుల పామును ఇట్టే పట్టేసింది. అంతటితో అయిపోలేదండోయ్. పాము ఆమె శరీరం చుట్టూ చుట్టుకుంటున్నా అదరలేదు..బెదరలేదు. 

ఆ పామును అట్టే పట్టుకుని దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సంఘటన మే 21, 2021 న వియత్నాంలో జరిగింది. పామును పట్టుకునే మహిళ ముఖం కనిపించడం లేదు గానీ, ఆమె చేసిన సాహసం చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌​ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ...‘‘ నేను పాములను ప్రేమిస్తాను. ఇలాంటి సాహసం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఇంకా అందుకు కావాల్సినంత ధైర్యం లేదు. ” అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మరో నెటిజన్‌ “ఓ! నేను ఎప్పటికీ చేయలేను!! ” అంటూ రాసుకొచ్చారు.

(చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement