big snake
-
వామ్మో.. ఎంత పామో!
తిరుమల: తిరుమల జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని నర్సరీలో మంగళవారం ఏడు అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు పామును చూసి, ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలేశారు.9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం జరగనున్నది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే పుష్పయాగం రోజున కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దయ్యాయి. 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’తిరుపతి (అలిపిరి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ నిర్వహించనున్నట్టు టీటీడీ మంగళవారం ఓ ప్రకటలో తెలిపింది. దీన్లోభాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు, జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. -
Viral: వామ్మో.. పది అడుగుల పామును ఇట్టే పట్టేసింది!
హనోయి(వియత్నాం): మామూలుగా పాము కనిపిస్తే ఏం చేస్తాం? దూరంగా పరిగెడుతాం..సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వియత్నాం లేడీ మాత్రం 10 అడుగుల పామును ఇట్టే పట్టేసింది. అంతటితో అయిపోలేదండోయ్. పాము ఆమె శరీరం చుట్టూ చుట్టుకుంటున్నా అదరలేదు..బెదరలేదు. ఆ పామును అట్టే పట్టుకుని దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సంఘటన మే 21, 2021 న వియత్నాంలో జరిగింది. పామును పట్టుకునే మహిళ ముఖం కనిపించడం లేదు గానీ, ఆమె చేసిన సాహసం చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ...‘‘ నేను పాములను ప్రేమిస్తాను. ఇలాంటి సాహసం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఇంకా అందుకు కావాల్సినంత ధైర్యం లేదు. ” అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ “ఓ! నేను ఎప్పటికీ చేయలేను!! ” అంటూ రాసుకొచ్చారు. (చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!) -
ఆరు అడుగుల నాగపాము
వైఎస్ఆర్ జిల్లా /కొండాపురం : గండికోట జలాశయంలో 12 టీఎంసీల నీరు నిల్వ చేయడంతో కొండాపురంలోని రామచంద్రనగర్ కాలనీలో పాణ్యం బెనర్జీ ఇంటిలోకి బుధవారం ఆరు అడుగుల నాగపాము రావడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు భయాం దోళనకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపారు. నీళ్లు నిల్వ ఉండటంతో తేళ్లు, పాముల రాకతో రామచంద్రనగర్ కాలనీలో భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిర్వాసితులు భయబ్రాంతులకు గురవుతున్నారు. -
ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళ బియాంకా డికిన్సన్ ఓ ఫొటో చూడాలంటే ఇప్పటికి వణికిపోతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో భారీ స్పందన వస్తుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఎఫ్బీ పోస్ట్ 11 వేల లైక్స్, 9800 షేర్లు, 7300 కామెంట్లను సొంతం చేసుకుంది. రెండు రోజుల కిందట తన పిల్లలతో సరదాగా బయటకు వెళ్లింది బియాంకా. తన ఇతర సంతానం ఆ పరిసర ప్రాంతాల్లో సరదాగా ఆడుకుంటుంటే.. నెట్ ఉన్న ప్రాంతంలో రెండేళ్ల కూతురు ఆగింది. దీంతో తన చేతిలో ఉన్న కెమెరాతో చిన్నారిని ఫొటో తీసింది. ఫొటో తీస్తుండగా పక్కనున్న చెట్ల నుంచి గాలికి ఏవో రాలి పడి కదులుతున్నట్లు బియాంకా డికిన్సన్ భావించింది. తాను తీసిన ఫొటో చూసిన ఆ తల్లికి కొన్ని సెకన్లలోపే ముచ్చెమటలు పట్టించింది ఆ ఫొటో. మొదట తన కూతురి నవ్వును అద్భుతంగా కెమెరాలో బంధించానని సంబరపడ్డ బియాంకా ఆ ఫొటోలో ఓ ముదురు గోదుమ రంగులో ఉన్న పెద్ద పామును గుర్తించింది. ఫొటో తీస్తున్నప్పుడు కూతురిపై మనసు పెట్టినందున అది పాము అని గమనించలేకపోయానని, కూతురికి అడుగు దూరంలో భయంకరమైన పాము వెళ్లినా.. ఎలాంటి హాని తలపెట్టలేదని పోస్ట్‌లో పేర్కొంది. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పిటికీ ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని ఆ పాప తల్లి బియాంకా డికిన్సన్ అంటోంది. గుడ్ ఫొటోగ్రఫీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం థ్యాంక్ గాడ్ అని కామెంట్ చేస్తున్నారు.