
వైఎస్ఆర్ జిల్లా /కొండాపురం : గండికోట జలాశయంలో 12 టీఎంసీల నీరు నిల్వ చేయడంతో కొండాపురంలోని రామచంద్రనగర్ కాలనీలో పాణ్యం బెనర్జీ ఇంటిలోకి బుధవారం ఆరు అడుగుల నాగపాము రావడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు భయాం దోళనకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపారు. నీళ్లు నిల్వ ఉండటంతో తేళ్లు, పాముల రాకతో రామచంద్రనగర్ కాలనీలో భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిర్వాసితులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment