చెన్నై టు వియత్నాం
డైరీ ఫుల్... ఈ మంత్ ఎండ్ వరకూ మహేశ్‌బాబు డైరీలో ఖాళీ లేదు. ఆల్మోస్ట్ అంతా ఫుల్! తర్వాత కూడా ఫుల్ బిజీనే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమాకు డేట్స్ రాసిచ్చేశారు. నిన్నటి వరకూ మహేశ్ హైదరాబాద్‌లో ఉన్నారు. రాత్రిపూట వచ్చే సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ రోజు చెన్నై వెళ్లారు. ఈరోజు అక్కడ కొత్త షెడ్యూల్ మొదలైంది. అది పూర్తయిన వెంటనే ఈ నెల 22న వియత్నాం వెళ్లనున్నారు.
మహేశ్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌లపై వియత్నాంలో ఓ పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’, ‘మర్మం’, ‘ఏజెంట్ శివ’... ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. చిత్ర బృందం వాటిపై స్పందించలేదు. త్వరలో మహేశ్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటిస్తామని తెలిపారు. ఈలోపు అభిమానుల సంతోషం కోసం సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ మధ్య మధ్యలో మహేశ్ లుక్స్‌ను ట్వీట్ చేస్తున్నారు.