
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ వియత్నాంకు చెందిన వియట్‌జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియట్‌జెట్ ఎయిర్‌లైన్స్ జులై- ఆగస్టు లో భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది.
పైలట్లు, ఎయిర్‌హోస్టెస్‌లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్‌లైన్స్‌గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment