వియత్నాంతో పుతిన్‌ చెట్టపట్టాల్‌ Putin signs deals with Vietnam in bid to shore up ties in Asia | Sakshi
Sakshi News home page

వియత్నాంతో పుతిన్‌ చెట్టపట్టాల్‌

Published Fri, Jun 21 2024 5:56 AM | Last Updated on Fri, Jun 21 2024 5:56 AM

Putin signs deals with Vietnam in bid to shore up ties in Asia

పలు ద్వైపాక్షిక ఒప్పందాలు ఖరారు 

హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. 

అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement