ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రెండురోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రెండురోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. వియత్నాం, చైనా దేశాలలో ఆయన పర్యటించనున్నారు. శుక్రవారం వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్య, చమురు వెలికితీత వంటి అంశాల్లో వియత్నాంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనంతరం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో చైనాలోని హాంగ్జూలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు.
ఈ సదస్సులో ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న సంస్థలు, దేశాలు.. పన్ను ఎగవేత వంటి అంశాలపై మోదీ మాట్లాడనున్నారు. అనంతరం 5న భారత్ తిరిగొచ్చి.. ఆ వెంటనే లావోస్‌లో రెండ్రోజుల పాటు జరిగే.. భారత-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరతారు.
An afternoon departure follows morning engagement.PM embarks on his bilateral visit to Vietnam & G20 Summit in China pic.twitter.com/1Dmcwn5WCX
— Vikas Swarup (@MEAIndia) 2 September 2016
An eastern journey for strengthening bilateral and multilateral diplomacy. PM departs for Vietnam, and China for G20 pic.twitter.com/tK8WsFz9fp
— Vikas Swarup (@MEAIndia) 2 September 2016