
చైనా ఊరుకోదు!
చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో సైనిక సంబంధాలను నెలకొల్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే చైనా ఊరుకోదని అక్కడి మీడియా పేర్కొంది...
వియత్నాంకు భారత్ క్షిపణుల అమ్మకంపై మీడియా కథనాలు
బీజింగ్: చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో సైనిక సంబంధాలను నెలకొల్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే చైనా ఊరుకోదని అక్కడి మీడియా పేర్కొంది. ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణులను వియత్నాంకు విక్రయించాలని భారత్ భావిస్తున్నట్టుగా వెలువడిన కథనాన్ని మీడియా ప్రస్తావించింది.
వియత్నాంతో సైనిక సంబంధాలను ఒకవేళ భారత్ వ్యూహాత్మక ఏర్పాటుగానే పరిగణించినా లేదా చైనాపై ప్రతీకార కోణంలో చూసినా.. అది ఇరు దేశాల మధ్య అశాంతిని సృష్టించడం మాత్రం ఖాయమని గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. క్షిపణుల సరఫరా సాధారణ ఆయుధాల అమ్మకమే అనుకున్నా.. భారత్ మీడియా దానిని చైనాతో పొంచి ఉన్న ముప్పుకు చెక్ పెట్టే చర్యగానే పేర్కొంటోందని తెలిపింది.