హనాయ్ : వియత్నాంలో దామ్రే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో 27 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో 40 వేల ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. తుపాను తీవ్రత మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎపెక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నేతలు వియత్నాం వెళ్లనున్న తరుణంలో ఈ విపత్తు జరగడంతో పలు దేశాల అధినేతలు ఆలోచనలో పడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వియత్నాం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తుపాను ధాటికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలో మగ్గిపోయారని ఉన్నతాధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment