ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్‌లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!
Comments
Please login to add a commentAdd a comment