
నూతన దంపతులు క్వీన్, ప్రదీప్
బెంగళూరు(దొడ్డబళ్లాపురం): స్వచ్ఛమైన ప్రేమకు భాష, ప్రాంతం, కుల, మతాలు అడ్డంకి కాదని వియత్నాం యువతి, కర్ణాటక యువకుని వివాహం రుజువు చేసింది. హావేరికి చెందిన ప్రదీప్ వియత్నాంలో గత 8 ఏళ్లుగా యోగా శిక్షకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నాలుగేళ్ల క్రితం క్వీన్ అనే యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.
వీరి ప్రేమను ఇరువైపుల కుటుంబాలు అంగీకరించడంతో హావేరి జిల్లా రామతీర్థ హొసకొప్పె గ్రామంలో ఇరువురి వివాహం జరిగింది. ప్రయాణాలపై నిర్భంధం ఉండడంతో వధువు వైపు బంధువులు రాలేకపోయారు. అయితే వీడియో కాల్ ద్వారా వివాహాన్ని వీక్షించారు.
చదవండి: (ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు)
Comments
Please login to add a commentAdd a comment