Mother Saves Child From Getting Crushed Under Truck Viral Video - Sakshi
Sakshi News home page

Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. క్షణం ఆలస్యమైనా..

Published Wed, Apr 27 2022 4:20 PM | Last Updated on Wed, Apr 27 2022 7:25 PM

Viral Video: Mother Saves Child From Getting Crushed Under Truck - Sakshi

ఈ  ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా బిడ్డ గురించి ఆలోచించింది ఓ మహిళ.  ట్రక్‌ కింద పడిపోతుండగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది.  ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. అయితే ఇది 2019లో జరగ్గా..   క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ తాజాగా తన ట్విట్టర్‌లో షేర్ చెయ్యడంతో ఇది మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

నామ్‌ దిన్హా ప్రాంతంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి  భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు వీరిని తాకుతూ ఓవర్‌ టేక్‌ చూస్తూ వెళ్లింది. దీంతో బైక్‌ వెనక కూర్చున్న తల్లి, చేతిలోని పిల్లాడు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. వేగంగా స్పందించి చక్రాల కింద పడిపోబోతున్న తన బిడ్డను చాకచక్యంగా వెనక్కి లాగింది. పెను ప్రమాదం నుంచి కుమారుడిని కాపాడుకుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ఘటనలో తల్లీ, కొడుకులు వెంట్రుకవాసిలో తల్లి, క్షేమంగా భయటపడ్డారు.  
చదవండి👉 ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి. తల్లి చాకచక్య తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది ఏది లేదు', 'క‌న్న‌పేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement