కొత్తటాటూతో యువ పాప్ స్టార్ | Justin Bieber gets new tattoo | Sakshi
Sakshi News home page

కొత్తటాటూతో యువ పాప్ స్టార్

Published Thu, Oct 8 2015 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

Justin Bieber gets new tattoo

లాస్ ఎంజిల్స్: హాలీవుడ్ ప్రముఖ యువ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఓ కొత్త టాటూతో ముందుకొచ్చాడు. ఈసారి తాను కొత్తగా విడుదల చేయనున్న ఆల్బం పేరుతో పచ్చబొట్టుపొడిపించుకున్నాడు. 'పర్పోజ్' పేరిట బీబర్ కొత్త ఆల్బం రూపొందించాడు. అయితే, ఇలా, టాటూలు వేయించుకోవడం జస్టిన్ బీబర్కు కొత్తేం కాదు. తాను ఆల్బం విడుదల చేసిన ప్రతిసారి దాని పేరిట తన ఒంటిపై టాటూ వేయించుకోవడం అతడికి ఓ సరదా.

తాను రూపొందించిన ఆల్బంను ఎంత ప్రేమిస్తానో అనే విషయం ఈ టాటూ ద్వారా చెప్తాడని అంటుంటారు. తొలిసారి విడుదల చేసిన బిలీవ్ అనే ఆల్బం పేరిట టాటూను 2012లో కుడిచేతిపై వేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఆల్బంలకు సంబంధించి హిప్స్ పై వేయించుకొని విమర్శలపాలయ్యాడు. కానీ నెలలు తిరగకుండానే మరో నెలలో నవంబర్ 13న పర్పోజ్ ఆల్బం విడుదల కానుండగా దానిని తన బొడ్డుపై భాగంలో రివర్స్లో ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొని చర్చల్లో నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement