హీరోగా వెళ్లి.. జీరో అయ్యాడు! | Justin Bieber involved in street brawl after NBA finals game | Sakshi
Sakshi News home page

హీరోగా వెళ్లి.. జీరో అయ్యాడు!

Published Fri, Jun 10 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

హీరోగా వెళ్లి.. జీరో అయ్యాడు!

హీరోగా వెళ్లి.. జీరో అయ్యాడు!

లాస్ ఏంజెలిస్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. బుధవారం ఎన్బీఏ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ గోల్డెన్ వారియర్స్, క్లీవ్ లాండ్ కవాలీర్స్ జట్ల మధ్య జరిగింది. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి హీరో తరహాలో వెళ్లిన పాప్ స్టార్ చివరికి జీరో అవ్వాల్సి వచ్చింది. క్లీవ్ లాండ్ కవాలీర్స్ జెర్సీ ధరించి మ్యాచ్ చూసిన బీబర్ ఆ తర్వాత బయటకు వచ్చి స్మోక్ చేశాడు. ఎందుకో తెలియదు కానీ, బాస్కెట్ బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అసహనంగా కనిపించిన బీబర్ ఓ వివాదంలో తలదూర్చాడు.

స్డేడియం లోపల ఉన్న ఓ కాంప్లెక్స్ లోకి తిరిగొచ్చిన బీబర్ ఓ వ్యక్తితో అనవసరంగా తగాదా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన బలాన్ని ప్రదర్శించాలని చూసి భంగపడ్డాడు. తొలుత అవతలి వ్యక్తిపై మూడు, నాలుగు పంచ్ లు విసిరాడు. అయితే దెబ్బతిన్న ఆ వ్యక్తి వెంటనే తేరుకుని డిఫెన్స్ చేశాడు. బీబర్ కు కూడా నాలుగు పంచ్ లు ఇచ్చాడు. అతడి పంచ్ దాటికి బీబర్ వెంటనే కింద పడిపోగా, అక్కడే ఉండి ఈ విషయాన్ని గమినిస్తున్న కొందరు ఆ ఇద్దరిని విడదీశారు. పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement